రాష్ట్రీయం

ప్రైవేటు విద్యాసంస్థలకు పిఎఫ్ మినహాయింపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: ప్రైవేటు విద్యాసంస్థలకు పిఎఫ్ మినహాయింపు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎపి విద్యా చట్టం 1982 ప్రకారం ఈ మినహాయింపు కోరడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన బెంచ్ ఆదేశించింది. పిఎఫ్ నుండి మినహాయింపును ఎపి ప్రైవేటు విద్యాసంస్థల సంఘం గతంలో ఢిల్లీలోని ఇపిఎఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి పొందింది. ఇలాంటి మినహాయింపు కోరినపుడు 1996లో పిఎఫ్ కమిషనర్ తిరస్కరించారు. దానిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను సంఘం ఆశ్రయించగా, సంఘం అనుకూల తీర్పు ఇచ్చింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలపై ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 1998లో హైకోర్టులో అప్పీలు చేశారు. దాంతో 2002లో సంఘం నాయకులు సుప్రీంకోర్టులో సివిల్ అప్పీలు వేశారు. దాంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను హైకోర్టుకు బదలాయిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని సూచించింది.