రాష్ట్రీయం

వలస ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన నివాసంలో భేటీ అయ్యారు. అలాగే, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా పాల్గొన్నారు. రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే అంశాన్ని వీరితో చర్చించారు. చివరకు సుజనా చౌదరి, టిజి వెంకటేష్ పేర్లను ఖరారు చేశారు. నాలుగో అభ్యర్థిని కూడా బరిలోకి దించాలన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పటికే అభ్యర్థి పేరును టిడిపి అధిష్ఠానం ఖరారు చేసింది. వైకాపా వ్యూహాన్నిబట్టి, ముందుకు సాగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలంతా విహార యాత్రల్లో ఉన్నారు. అయితే, వీరంతా తమకు టచ్‌లో ఉన్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రకటించడం వైకాపాకు కొంత టెన్షన్ తెప్పిస్తోంది. టిడిపికి రెండు, బిజెపికి ఒక రాజ్యసభ అభ్యర్థిని ఎన్నుకునేందుకు కావల్సిన బలం టిడిపి వద్ద ఉంది. అప్పటికీ టిడిపి వద్ద 19 మంది ఎమ్మెల్యేలు అదనంగా మిగులుతారు. కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు బుధవారం టిడిపిలో చేరనున్నారు. దీంతో టిడిపికి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టవుతుంది. ఒక రాజ్యసభ అభ్యర్థిని ఎన్నుకోడానికి 36 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే మరో 15 మంది ఎమ్మెల్యేలు టిడిపికి మద్దతు పలకాల్సి ఉంటుంది. ఇది ఎంత వరకూ సాధ్యమన్నది ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. వలస ఎమ్మెల్యేలు చెపుతున్నట్టు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపికి టచ్‌లో ఉంటే మాత్రం రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది.