రాష్ట్రీయం

నేపాల్ యాత్రికుల కథ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30: ఉత్తర భారతదేశం, నేపాల్‌లోని దేవాలయాల సందర్శనకు బయలుదేరి, మూడు రోజులుగా సమాచారం అందకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా యాత్రికుల కథ సుఖాంతమయ్యింది. వారంతా క్షేమంగా ఉన్నట్టు సోమవారం సాయంత్రం సమాచారం అందడంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జల్లిపల్లి అంజనీకృష్ణకుమార్, శ్యామలా, మద్ది శ్రీను, విజయలక్ష్మి, సురేష్, రోజా, వారి కుమారులు చందన్, శరత్, బేబి, వారి కుమార్తెలు మనీషా, శ్రీవాణి, కె నూకరాజు, శకుంతల మొత్తం 28మంది ఉత్తర భారత్, నేపాల్ యాత్రకు బయలుదేరారు. 17న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో యాత్రకు బయలుదేరి వెళ్లారు. కోల్‌కతా ప్రాంతంలో పర్యటించినంతవరకు వీరి నుంచి ఎప్పటికప్పుడు బంధువులకు సమాచారం వస్తుండేది. నేపాల్ వెళ్తున్నామని చెప్పిన అనంతరం ఎటువంటి సమాచారం లేకుండాపోయింది. 4 రోజుల నుండి వీరి ఆచూకీ కోసం బంధువులు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. యాత్రలో ఉన్న కృష్ణకుమార్ సోదరుడు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు కృష్ణకుమార్ కుమారుడు పవన్‌కృష్ణ ఈ సమాచారం అందించి వారి వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఆ విధంగా చేసిన ప్రయత్నాల్లో వీరంతా నేపాల్ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్న సమయంలో సమస్యలు తలెత్తినట్లు వెల్లడయ్యింది. సరిహద్దుల్లో అక్కడి పోలీసులు వీరిని నిలిపివేసి పూర్తిసమాచారాన్ని సేకరించడానికి మూడు రోజులుగా అక్కడే ఉంచివేశారు. చివరకు సోమవారం సాయంత్రానికి ఈ వ్యవహారాలు పూర్తికావటంతో వారిని కోల్‌కతా పంపివేశారు. ఈసమాచారం అందటంతో వారి బంధువులంతా ఊపిరిపీల్చుకున్నారు.

మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై
తోటి ఉద్యోగి అత్యాచార యత్నం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మే 30: విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను అదే స్టేషన్‌లో పనిచేసే సి రామన్ అనే కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సోమవారం ఎంఆర్ పల్లిలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేశారు. తిరుపతికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్నారు. ఈనెల 27వ తేదీ రాత్రి సెంట్రి డ్యూటీలో విధులు నిర్వహిస్తోంది. ఆ సమయంలో వారాంతపు సెలవులో ఉన్న సి రామన్ అర్ధరాత్రి సమయంలో పోలీసుస్టేషన్‌కు వచ్చాడు. ముఖ్యమైన ఫైల్ ఉందని తీసుకువెళ్లాలని, స్టేషన్ తలుపులు మూసి లోపల ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో అన్నాడు. దీంతో ఆమె తలుపు తెరిచింది. ఫైల్ వెతుకుతున్నట్లు కొంతసేపు రామన్ నటించి సిఐ గదిలో ఫైల్ ఉంటుందని చూసి పెట్టాలని ఆమెకు చెప్పాడు. ఆమె గదిలోకి వెళ్లగానే వెంటనే వెనుక నుంచి వెంబడించిన రామన్ అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేస్తూ స్టేషన్ బయటకు వచ్చేసింది. ఎక్కడైనా ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు చెబుతోంది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు సమాలోచన అనంతరం సోమవారం ఎంఆర్ పల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.