రాష్ట్రీయం

అమరావతి మెట్రో రైల్‌కు రూ.3600 కోట్ల జైకా రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకాలు ఒక్కొక్కటి తొలుగుతున్నాయి. త్వరలో అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ పేరిట ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడలో 26.03 కి.మీ పొడువున రెండు కారిడార్ల నిర్మాణానికి రూ. 3600 కోట్ల రుణం మంజూరు చేసేందుకు జపానీస్ ఇంటర్నేషనల్ ఏజన్సీ (జైకా) ముందుకు వచ్చింది. జైకాతో రాష్ట్రప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రాజెక్టు వ్యయం రూ.6768 కోట్లు అవుతుందని అంచనా. విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్, కేంద్రప్రభుత్వం చెరిసగం నిధుల వ్యయాన్ని పంచుకుంటాయి. జైకా తన వాటా కింద రూ.3600 కోట్లను విడుదల చేస్తుంది. వడ్డీ లేకుండా కేంద్రానికి రూ.333.5 కోట్లు, రాష్ట్రానికి రూ.1102.5 కోట్ల నిధులు లభించనున్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలను కేంద్రం ఖరారు చేయనుంది. తొలి సంవత్సరం అంటే ఈ ఏడాది రూ.143 కోట్ల పనులను చేపడుతారు.