తెలంగాణ

నేడు హిందూ ఏక్తాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 30: పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్ర మంగళవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో పెద్దఎత్తున నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దేశం, ధర్మం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతోపాటు హిందు సమాజాన్ని జాగృతం చేసేందుకు చేపడుతున్న ఈ యాత్రకు హిందువులు దండులా కదిలేందుకు సిద్ధమవుతున్నారు. వారం రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుండటంతో యాత్రలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు కరీంనగర్ నగరానికి తరలివచ్చారు. ఏక్తా యాత్ర సందర్భంగా కరీంనగర్‌లోని ప్రముఖ కూడళ్ళు, రహదారులన్ని కాషాయతోరణాలతో నిండిపోయాయి. యాత్ర సందర్భంగా భారీ అంజన్న విగ్రహాంతోపాటు సీతారాముల విగ్రహాలను తెప్పించి వాటిని రథంపై ఊరేగించనున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతిస్వామి హాజరవుతున్నారు. అటు అంజన్న భక్తులు, ఇటు హిందువులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న దరిమిలా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేయగా, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. యాత్ర కొనసాగే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించనుంది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో విదేశీ ప్రేరేపిత తీవ్రవాదుల చేతుల్లో అసువులు బాసిన ఎస్‌ఐ సిద్ధయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు మహేశ్వర్‌ల త్యాగాలను నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారి కుటుంబసభ్యులను సన్మానించి, మనోధైర్యం కల్పించనున్నట్లు నిర్వహకులు బండి సంజయ్‌కుమార్ తెలిపారు. వివిధ స్వచ్చందలు నీటి వితరణ, మజ్జిగ వితరణ చేస్తున్నాయని, ఎమర్జెన్సీ వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో హిందువులు పాల్గొని విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.