తెలంగాణ

భూమి రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, మే 30: మెదక్ జిల్లా తొగుట మండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వానికి భూములు అప్పగించేందుకు కొందరు వ్యక్తులు కారకులని భావించిన జనం ఆగ్రహంతో నలుగురి ఇళ్లపై సోమవారం దాడి చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తులను సంబంధించిన కారు, బైక్ ధ్వంసంను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోని సామాగ్రి చిందరవందర చేశారు. అంతేకాకుండా మరో ఇద్దరి ఇళ్లపై దాడి చేయబోగా పోలీసులు క ల్పించుకుని ఎలాగోలా నియంత్రించగలిగారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని ప్రభుత్వ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్త్తూ రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణతో గ్రామానికి చెందిన ఎంపిటిసి ప్రతాప్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అంజాగౌడ్‌లపై మహిళలు పెద్దసంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఇళ్లపై దాడులకు దిగారు. ఏటిగడ్డకిష్టాపూర్ ఎంపిటిసి ప్రతాప్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేయగా, జీవన్‌రెడ్డికి చెందిన బైక్, ఇంటిపై దాడి చేసి వస్తువులను చిందరవందర చేశారు. అంతటితో ఆగకుండా నర్సింహారెడ్డి, అంజాగౌడ్ ఇళ్ల పైకి దాడికోసం యత్నించగా వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో డివిజన్‌లోని సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పెద్దఎత్తున మోహరించి ప్రజలను సముదాయించి దాడులను అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. తమజీవితాలను దగాచేసే వారికి మీరు ఎందుకు రక్షణగా వచ్చారని పోలీసులను ప్రశ్నించారు. చివరకు ప్రజలు పంచాయతీ చౌరస్తాకు చేరుకొని గ్రామస్థుల అభిప్రాయం కాదని భూములు రిజిస్ట్రేషన్ చేసిన వారు పంచాయతీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇదిలావుండగా, ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

వేధింపులు తాళలేక
వివాహిత ఆత్మహత్య
పోలీసుల అదుపులో మృతురాలి తల్లి
నకిరేకల్, మే 30: కట్టుకున్న భర్త, అత్తతో పాటు కన్నతల్లి సైతం వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు సదరు మహిళ తనను తల్లితో పాటు భర్త, అత్త వేధిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులకు లేఖలు పంపడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నకిరేకల్ సిఐ జె.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నోముల గ్రామానికి చెందిన గుర్రపు పద్మ కుమార్తె ఝాన్సీరాణి (21)ని రెండేళ్ల క్రితం నల్లగొండ మండలం దీపకుంట గ్రామానికి చెందిన గూడూరు విజయేందర్‌రెడ్డికి ఇచ్చి బలవంతంగా వివాహం చేశారు. అనంతరం ఝాన్సీ హైదరాబాద్‌లోని ఎంవిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఝాన్సీపై శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఈనెల 23న ఇంజనీరింగ్ ఫైనలియర్ పరీక్షలు రాసిన ఝాన్సీని భర్త విజయేందర్‌రెడ్డి నకిరేకల్‌లో తల్లిగారింటి వద్ద వదిలి వెళ్లాడు. ఆ మరుసటి రోజు 24వ తేదీన ఝాన్సీ ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మృతదేహాన్ని అత్తగారి గ్రామమైన దీపకుంటకు తరలించి 25న దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఇదిలాఉండగా ఈ నెల 23న ఝాన్సీ తన తల్లి గుర్రపు పద్మ, భర్త విజయేందర్‌రెడ్డి తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వ్యభిచారం చేయాలని వేధింపులకు గురిచేస్తున్నారని డిజిపి, జిల్లా ఎస్పీ, నకిరేకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు పోస్టు ద్వారా ఫిర్యాదు పత్రాలను పంపించగా ఈనెల 28న సాయంత్రం నకిరేకల్ ఎస్‌హెచ్‌వోకు సదరు ఫిర్యాదు పత్రాలు అందాయి. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఝాన్సీ తల్లిని అదుపులోకి తీసున్నారు.

రాష్ట్ర ఆత్మగౌరవాన్ని
తాకట్టు పెట్టారు
టి.టిడిపినేతలపై కర్నె ప్రభాకర్ ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 30: తెలంగాణ టిడిపి నాయకులు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నాయకులకు తాకట్టు పెట్టారని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, పాదయాత్ర చేసి టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తానని చెబుతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మోకాళ్లపై యాత్ర చేసినా ఫలితం ఉండదన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణకు ఉన్న 1230 టిఎంసిల నీటి హక్కును వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని భయపడుత్ను టి.టిడిపి నాయకులు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ అక్రమమని టిటిడిపి నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి మహానాడులో చెప్పడం తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దడమేనని విమర్శించారు.
నలుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 30: తెలంగాణలో నలుగురు ప్రొబిషనరీ ఐఎఎస్ అధికారులను అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనురాగ్ జయంతిని ఆదిలాబాద్, గౌతమ్‌ను మహబూబ్‌నగర్, బమేలా సత్పతిని రంగారెడ్డి, రాహుల్ రాజ్‌ను నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమించారు. త్వరలో వీరు బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.

పెట్రో ట్యాంకర్ల
సమ్మె విరమణ
వ్యాట్ ఉపసంహరణకు సర్కారు హామీ
నేడు మరోసారి చర్చలు : అసోసియేషన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 30: తెలంగాణలో డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె విరమించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానుల చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్టు పెట్రో ట్యాంకర్ల యజమానులు ప్రకటించారు. పెట్రో ఉత్పత్తులపై 14.5 శాతం వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30 నుంచి డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విధితమే. కాగా సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 3500 ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ట్యాంకర్ల యజమానుల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. చర్చల అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే సమ్మె విరమణ తాత్కాలికమేనని, మంగళవారం ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపి ప్రకటిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు దినేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వినయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న వ్యాట్ బకాయిలను చెల్లిస్తామని, సమ్మెను విరమించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కోరగా సంతృప్తి చెందిన పెట్రో, డీజిల్ టాంకర్ల యజమానులు సమ్మెను విరమించినట్టు తెలిపారు. మరోసారి పూర్తి స్థాయిలో మంగళవారం అధికారులతో చర్చలు జరుపనున్నట్టు ట్యాంకర్ల యజమానుల సంఘం నాయకులు తెలిపారు.