తెలంగాణ

మిషన్ కాకతీయకు నాబార్డ్ సాయం రూ. 800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: మిషన్ కాకతీయ పథకం కోసం నాబార్డ్ 800 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ ఏడాది 1800 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వం కోరగా, 800 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు నాబార్డ్ అంగీకరించినట్టు చెప్పారు. నీటిపారుదల శాఖకు చెందిన వివిధ అంశాలపై హరీశ్‌రావు సోమవారం సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. 2017 నాటికి నాలుగు లక్షల 60వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులకు 35 చోట్ల రైల్వే క్రాసింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడి వాగు, కొమురం భీమ్, కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టెంపాడు, కొయిల్‌సాగర్, ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు, వరంగల్‌లో దేవాదుల, నల్లగొండ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టుల పరిధిలో రైల్వే క్రాసింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాలని హరీశ్‌రావు రైల్వే అధికారులను కోరారు. ప్రజలకు మేలు చేయడం కోసం ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు త్వరగా తీసుకోవాలని అన్నారు. రైల్వేలో తాతల కాలం నాటి నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇకపై ప్రతినెల రైల్వే, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్వహించాలని సూచించారు.
జనవరి నుంచి 3వ దశ మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ మూడవ దశ పనులను జనవరి నుంచి మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మూడవ దశ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని మంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత కోసం టెండర్ల ప్రక్రియను సులభతరం చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ పనులు అంచనాల నుంచి మంజూరు వరకు అన్నింటి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు. ఐదు లక్షల లోపు పనులకు మూడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోతే ఆయా గ్రామ పంచాయితీలకే పనులు అప్పగించాలని తెలిపారు. మెదక్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం అధికారులతో హరీశ్‌రావు సమావేశం అయ్యారు.