రాష్ట్రీయం

బెజవాడలో తారాచౌదరి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), డిసెంబర్ 11: హైదరాబాద్‌లో తనదైన శైలిలో ప్రముఖులపై ఆరోపణలు చేసి వారి శృంగార దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న తారాచౌదరి తాజాగా బెజవాడలో మరో వివాదానికి తెరదీసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే హైదరాబాద్ వివాదం తరువాత గుంటూరు జిల్లా వినుకొండలో అన్న శ్రీనివాసరావు, వదిన కవితల దగ్గర కొంతకాలం ఉన్న తారాచౌదరి వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేయడంతో ఆరు నెలల క్రితం వారు విజయవాడలోని పాయకాపురం శాంతినగర్‌కు వచ్చి నివాసమేర్పరచుకున్నారు. విషయం తెలుసుకున్న తారాచౌదరి ఎట్టకేలకు అన్నా వదినల చిరునామాను పసిగట్టింది. గురువారంనాడు పాయకాపురం శాంతినగర్‌లో నివాసముంటున్న అన్నా వదినల దగ్గరకు వెళ్లి నానా గొడవ చేసింది. అయితే ఉదయానే్న మాట్లాడుకోండి అని స్థానికులు నచ్చచెప్పడంతో శాంతించిన తారాచౌదరి శుక్రవారం ఉదయం మరోసారి తన వదిన కవితతో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఆమెపై దాడి చేసింది. అంతే కాక తనే 100కు ఫోన్ చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించగా తారదే తప్పని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో తారాచౌదరిని అరెస్టు చేయబోయిన మహిళా కానిస్టేబుల్ జ్యోతిపై తారాచౌదరి దాడి చేసింది. దీంతో తారాచౌదరిని అరెస్టు చేసిన నున్న పోలీస్ స్టేషన్ సిఐ సెహారాబేగం తారాచౌదరిపై సెక్షన్ 323, 341, 506 కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.