రాష్ట్రీయం

హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మే 31: సకల జన శ్రేయస్సే లక్ష్యంగా యుగాల నాడు ఆవిర్భవించిన హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం నిరంతరం కృషి చేస్తోందని ఆ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి స్పష్టంచేశారు. హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన స్వామీజీ పాత గుంటూరులోని ప్రసిద్ధ శ్రీ వీరాంజనేయ స్వామివారిని సందర్శించి అక్కడ జరిగిన మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, విలేఖర్లను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తూ, హైందవ ధర్మ పరిరక్షణ కేవలం ఏ ఒక్కరికో సంబంధించింది కాదని, ఈ పుణ్యభూమిలో జన్మించిన ప్రతి హిందూ బంధువు ఇదొక పవిత్ర యజ్ఞంలాగా భావించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యసాధన కోసం విశాఖ శారదాపీఠం స్థాపించిన నాటినుండి మారుమూల గ్రామాల్లో సైతం అనేక ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజానీకంలో సనాతన ధర్మ జాగృతిని కల్గిస్తోందన్నారు. విశ్వజనీనమైన హైందవ ధర్మం సమస్థ మానవాళి సుఖ సంతోషాలను కాంక్షిస్తోందన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఆలయాలను పరమ పవిత్రమైన భావనతో తీర్చిదిద్దాలని, వీటి నిర్వహణలో భక్తితత్వం, భగవత్ సంబంధమైన దైవ కార్యక్రమాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలను ప్రస్తావించకూడదని స్వామీజీ సూచించారు. హైందవ ధర్మ వికాసానికి ధర్మజాగృతిని కొనసాగిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్లో శారదాపీఠం ప్రజలందరినీ భాగస్వాములను చేస్తోందన్నారు. ధర్మోద్ధరణకు త్రేతాయుగం నాడే నాంది పలికిన కారణజన్ముడు, మహాతాత్వికవేత్త రామభక్తిలో తనకు తానే సాటి అనిపించుకున్న ఆంజనేయుడు ముఖ్య భూమికను పోషించారని స్వామీజీ గుర్తుచేశారు. తొలుత వీరాంజనేయ స్వామి దేవస్థానానికి విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి, ఆయన పరివారానికి దేవాలయ పాలకవర్గం పూర్ణకుంభంతో స్వాగతం పలికింది. స్వామివెంట పీఠ ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ పలువురు వేద పండితులున్నారు.

చిత్రం గుంటూరులో మంగళవారం జరిగిన హనుమజ్జయంతి మహోత్సవాల్లో ప్రసంగిస్తున్న శారదాపీఠాధిపతి
స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి