రాష్ట్రీయం

ప్రైవేటుకు ఫీజుల నిర్ధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లను కట్టడి చేసే పనిలో ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో సమస్త సౌకర్యాలు కల్పిస్తున్నామని, అన్ని స్కూళ్లలో టీచర్లను నియమిస్తున్నామని, ఇక మంచి ఫలితాలను సాధించాల్సిన బాధ్యత టీచర్లపై ఉంటుందని అన్నారు. ప్రైవేటు స్కూళ్లు సైతం నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని, అన్ని స్కూళ్లలో ఫీజులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో డ్రాపవుట్లను గుర్తించడం, వారికి అవసరమైన విద్యాసౌకర్యాలను కల్పించడం, ఓపెన్ స్కూలు ద్వారా వారు పరీక్షలకు హాజరయ్యేలా చూడటం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు అన్ని చర్యలూ తీసుకోవాలని అన్నారు.అంతకుముందు ఉప ముఖ్యమంత్రి ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య, డైరెక్టర్ జి కిషన్, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీలో 43.39 శాతం, ఇంటర్‌లో 49.69 శాతం
ఓపెన్ స్కూలు సొసైటీ నిర్వహించిన పరీక్షల్లో 51,199 మంది హాజరుకాగా, అందులో 22,214 మంది పాసయ్యారని , 43.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. హాజరైన వారిలో 36,335 మంది అబ్బాయిలు, 14,864 మంది అమ్మాయిలు ఉన్నారని వారిలో 15,046 మంది అబ్బాయిలు, 7168 మంది అమ్మాయిలు పాసయ్యారని చెప్పారు. ఫలితాల రీ కౌంటింగ్‌కు 100 రూపాయిలు చెల్లించి జూన్ 4 నుండి 13వ తేదీ మధ్య దరఖాస్తు చేయవచ్చని, రీ వెరిఫికేషన్‌కు వెయ్యి రూపాయిల ఫీజుతో దరఖాస్తు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో 35137 మంది అబ్బాయిలు, 17,377 మంది అమ్మాయిలు పరీక్ష రాయగా వారిలో 16,767 మంది అబ్బాయిలు, 9328 మంది అమ్మాయిలు పరీక్ష పాసయ్యారని ఇంటర్‌లో 49.69 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేరొ=కన్నారు. బి గ్రేడ్‌లో 17 మంది, సి గ్రేడ్‌లో 571 మంది, డి గ్రేడ్‌లో 3241 మంది, ఇ గ్రేడ్‌లో 8455 మంది, ఎఫ్ గ్రేడ్‌లో 11,408 మంది, జి గ్రేడ్‌లో 2403 మంది పాసయ్యారని వివరించారు. సబ్జెక్టుకు 200 చొప్పున రీకౌంటింగ్‌కు, సబ్జెక్టుకు వెయ్యి రూపాయిలు చొప్పున రీ వెరిఫికేషన్‌కు జూన్ 4 నుండి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.