రాష్ట్రీయం

పండగ జరగాలె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: రాష్ట్రావతరణ వేడుకలను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైంది. రాష్టవ్య్రాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ అక్కడ స్థిరపడిన తెలంగాణ ప్రజల సహకారంతో వేడుకల నిర్వహిస్తోంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ ప్రజలు అత్యధికంగా ఉండే ముంబయి, సూరత్, బివాండి, పూణె తదితర నగరాల్లో కూడా వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
వేడుకల నిర్వహణ కోసమే ప్రత్యేకంగా హోంమంత్రి నాయిని నరసింహ్మరెడ్డి అధ్యక్షతన నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉప సంఘంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది. కమిటీ రెండు వారాలుగా ప్రతీ రోజు సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై రాజధానితో పాటు జిల్లాల వారీగా వేడుకలను సమీక్షిస్తుంది. వేడుకల నిర్వహణకు ఇప్పటికే జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. వేడుకల సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పర్యాటక ప్రాంతాలను, చారిత్రిక కట్టడాలను, రైల్వే, బస్ స్టేషన్లను విద్యుద్దీపాలతో ఇప్పటికే అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ప్రధాన కూడళ్లలో హోర్డింగులు, ఫ్లెక్సీలు, బెలున్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రావతరణ రోజున ఉదయం 9.30కు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద సిఎం కెసిఆర్ నివాళులు ఆర్పించనున్నారు. తర్వాత 9.45కు లుంబినీ పార్క్ వద్ద నిర్మించబోయే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపానికి భూమి పూజ నిర్వహిస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్‌కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన అతి పెద్ద జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. 10.30కు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని గౌరవందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన, రాష్ట్రావతరణ సందర్భంగా ఎంపిక చేసిన వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. అదే రోజు సాయంత్రం హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి జిల్లాకు వందమంది ప్రముఖులను ఆహ్వానించి రాష్ట్ర ప్రగతి సదస్సు నిర్వహిస్తోంది. దీనికి గవర్నర్ అధ్యక్షత వహించనుండగా సిఎం కెసిఆర్ హాజరుకానున్నారు.

చిత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం రాష్ట్రావతరణ మార్చ్‌పాస్ట్ రిహార్సల్స్ చేస్తున్న పోలీసులు