రాష్ట్రీయం

62 మందికి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: రాష్ట్రావతరణ వేడుకలు పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన 62మంది ప్రతిభావంతులను ‘తెలంగాణ రాష్టస్థ్రాయి అవార్డులు- 2016’కు ఎంపిక చేసి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అవార్డుకు ఎంపికైన వారిని జూన్ 2న పరేడు గ్రౌండ్‌లో జరగబోయే వేడుకల వేదికపై ప్రశంసా పత్రం, రూ.1,00,116 నగదు బహుమతితో సిఎం కెసిఆర్ సత్కరిస్తారు. ఎంపికైన వారిలో సాహితీ రంగం నుంచి కోవెల సుప్రసన్నాచార్య (వరంగల్), కపిలవాయి లింగమూర్తి (మహబూబ్‌నగర్), ముదిగంటి సుజాతారెడ్డి (కరీంనగర్), సంగిశెట్టి శ్రీనివాస్ (మహబూబ్‌నగర్), కెవి నరేందర్ (కరీంనగర్), అబ్దుల్ రహమాన్ ఖాన్ (హైదరాబాద్), మీర్ ఇబ్రహీం హమ్మి (హైదరాబాద్)లు ఉన్నారు. నృత్య రంగం నుంచి దీపికారెడ్డి (హైదరాబాద్), దుంపెటి ప్రకాశ్ (పేర్ని), జానపద నృత్యంలో అంతడపుల నాగరాజు (ఆదిలాబాద్), సంగీతంలో మిట్టా జనార్దన్ (హైదరాబాద్), కె రామాచారి (మెదక్), జానపద సంగీతంలో ఎస్ ప్రభాకర్ (మెదక్), జంగిరెడ్డి (మహబూబ్‌నగర్), ధర్మానాయక్ (నల్లగొండ), సిహెచ్ రవి (ఆదిలాబాద్), గంగ (నిజామాబాద్)లను ఎంపిక చేశారు. ఉద్యమగానం కింద యశ్‌పాల్ (ఖమ్మం), పద్మావతి (కరీంనగర్), తేలు విజయ (కరీంనగర్), చిత్రకళ నుంచి వై బాలయ్య (మెదక్), వేద పండితుల కింద మాడుగుల మాణిక్య సోమయాజులు (రంగారెడ్డి), అర్చకులుగా నల్లంతిహల్ నరసింహ్మాచార్యులు (ప్రధాన అర్చకులు, యాదగిరిగుట్ట), ధార్మిక ప్రవచకుల కింద కొడకండ్ల నరసింహారామ సిద్ధాంతి (వరంగల్), రేవరెండ్ నల్ల థామస్ సెంచనరీ బాప్టిస్ట్ చర్చ్, జనాబ్ ముఫ్తి అజీముద్దీన్ సాహెబ్, శాస్తవ్రేత్తల విభాగంలో డాక్టర్ వి రామగోపాల్‌రావు (ఐఐటి ఢిల్లీ), అంకతి రాజు (అగ్ని ప్రాజెక్టు, డిఆర్‌డిఎల్), జర్నలిజమ్ నుంచి సిఆర్ గౌరిశంకర్, నూర శ్రీనివాస్ (వరంగల్), ఆకారపు మల్లేశ్, ఎంఎ మాజీద్, కట్టా కవిత (ఎలక్ట్రానిక్ మీడియా), శంకర్ (కార్టునిస్ట్)లను ఎంపిక చేశారు. చేతివృత్తుల కింద నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రీయల్ కోఅపరేటివ్ సోసైటీ, నిర్మల్, క్రీడల విభాగంలో అనూప్ (రోలర్ స్కేటింగ్), ఆనంద్ (కో-కో), ఉద్యోగుల విభాగం నుంచి హనుమంతరావు, రావుల ఉమారెడ్డి, సి ప్రభాకర్, ఎ శ్రీనివాసులు, పి రాజమోహన్, పి హనుమంత్‌రావు, వి సుభాష్, తాజ్‌ముల్ హుస్సేన్, వైద్యుల విభాగం కింద డాక్టర్ ఎ గోపాలకృష్ణ (నేఫ్రాలజిస్ట్), స్వచ్చంధ సంస్థల విభాగంలో గ్రామ్యా రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్‌ను ఎంపిక చేశారు. సామాజిక సేవలో డాక్టర్ విజయ భాస్కర్ (గోదావరిఖని), రైతుల విభాగంలో ఎం అంజిరెడ్డి (ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా), వర్ని శంకర్ (కోటగిరి, నిజామాబాద్), అంగన్‌వాడి వర్కర్‌గా గంగామణి (నవీపేట, నిజామాబాద్), ఉత్తమ మున్సిపాల్టీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీగా మల్కాపూర్ (మెదక్ జిల్లా), మాదాపూర్ (కరీంనగర్) ఎంపిక చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విభాగంలో ఎ లక్ష్మినారాయణ (వరంగల్), న్యాయవాదుల విభాగంలో గుడిమల్ల రవికుమార్ (వరంగల్)ను ఎంపిక చేశారు. ఉత్తమ మండలముగా వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా), ఉపాధ్యాయుల విభాగంలో గోల్దె బల్‌బీర్ సింగ్ కౌర్ (గంగాధర, కరీంనగర్ జిల్లా), వినూత్న సాగు చేపట్టిన రైతుగా మధుసూదన్‌రెడ్డి, మాజీ సైనికుల విభాగం నుంచి కల్నల్ శివకిరణ్ కుమార్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఎ బాలకృష్ణ, పోలీసు అధికారిగా రాధిక (ఎఎస్‌పి, ఆదిలాబాద్) ఎంపికయ్యారు.