రాష్ట్రీయం

రాజధాని ముసుగులో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: అమరావతి నిర్మాణంలో సింగపూర్ కంపెనీలను భాగస్వామం చేయడానికి సంబంధించి వివరాలను వెంటనే చంద్రబాబు ప్రభుత్వం బహిర్గతం చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సింగపూర్ కంపెనీలకు మొత్తం భూములను కట్టబెట్టి రాష్ట్రప్రజల నోట్లో మట్టి కొడితే చూస్తూ ఊరుకోమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యవహారం, పారదర్శకతతో వ్యవహరించాలన్నారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజారాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం జరుగుతోందన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే గాలి, నీరు, ఆకాశం, భూమిని కూడా కబ్జా చేయడానికి వెనకాడరన్నారు. రాజధాని నిర్మాణంలో రాజకీయ పార్టీలను, ప్రజలను భాగస్వామ్యం చేయకుండా, తన సొంత ఇంటి వ్యవహారంలా మార్చివేయడం తగదని ఆయన తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు. సింగపూర్ కంపెనీ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నరు. ఈ ప్రాతిపదికన సింగపూర్ కంపెనీలకు భూములు అప్పచెబుతారన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనిపై పారదర్శకత లోపించిందన్నారు. ఇసుక మాఫియాలో టిడిపి పెద్దల హస్తం ఉందన్నారు.

కాపుల సంక్షేమ పథకాల
అమలుకు మార్గదర్శకాలు

హైదరాబాద్, డిసెంబర్ 11: కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లను కాపుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది.
ఈ నిధులతో కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఈ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించవలసి ఉందని ప్రభుత్వం తెలిపింది.