రాష్ట్రీయం

ట్రావెల్స్ దగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 65మంది ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజన్సీ ద్వారా నేపాల్, మానస సరోవర్ యాత్రకు వెళ్ళగా, వారిని ట్రావెల్స్ యజమాన్యం అక్కడే వదిలేయటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాకు చెందిన తొమ్మిది మందితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారంతా కలిసి హైదరాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్ ఏజన్సీ ద్వారా యాత్రకు వెళ్ళారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 2లక్షల రూపాయలు తీసుకున్న సదరు యజమాన్యం ఖాట్మండ్ సరిహద్దులో వారిని వదిలేసింది. యాత్రికుల వెంట ఉన్న ట్రావెల్స్‌కు చెందిన రమణ అనే ఉద్యోగి ఆ ప్రాంతం నుంచి కన్పించకుండా వెళ్ళాడు. అక్కడ నుంచి యజమాన్యాన్ని సంప్రదించినా పట్టించుకోలేదని పర్యాటకులు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఖమ్మం నగరానికి చెందిన సత్యనారాయణ తెలిపారు. కాగా తనతో పాటు ఉన్న వారంతా భోజనం కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్టర్రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితో ఫోన్‌లో మాట్లాడి యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేరేలా చూడాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా ఢిల్లీలో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర పర్యాటక శాఖను అప్రమత్తం చేయటంతో వారి ద్వారా 65మంది యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.