తెలంగాణ

నదుల వాటా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూన్ 1: నదుల వాటాలను తేల్చాకే కృష్ణానది జలాలను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకోవాలని భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి పట్టణ శివారులోగల పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ శంకుస్థాపన కోసం మంత్రి హరీశ్‌రావు విచ్చేశారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్‌కూడా ఉన్నారు. అనంతరం హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం రెండవ విడత కింద 5.41 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాజెక్ట్‌లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే కృష్ణానది జలాలను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కృష్ణానది జలాల వాటా తెలంగాణకు ఎంత, ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అనేది లెక్క తేలకుండానే బోర్డుపరిధిలోకి నదులను తీసుకురావడానికి కృష్ణాబోర్డు అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని, ఈవిషయమై కెసిఆర్ బుధవారం ఉదయం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. అలాగే త్వరలోనే తానుకూడా ఢిల్లీకి వెళ్లి ఈ విషయమై కేంద్రమంత్రికి వివరించి, కృష్ణానది జలాల వాటాలు తేల్చాకే కృష్ణాబోర్డు నదులను కృష్ణా బోర్డుపరిధిలోకి తీసుకు వచ్చి, తెలంగాణ రాష్ట్రప్రయోజనాలను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కృష్ణాజలాల విషయం ఇటు సుప్రీం కోర్టులోఉందని, అలాగే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సైతం ఉందని, ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేది కోర్టుద్వారా తేలక ముందే కృష్ణానదిప్రాజెక్ట్‌లను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని తాము నిరసిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే బి.జనార్థన్‌గౌడ్, నీటిపారుదల శాఖ ఇఇ మధుకర్‌రెడ్డి, డిఇఇ వెంకటేశ్వర్లు, జెఎఇ మోహన మురళి, స్థానిక ఎంపిపి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.