రాష్ట్రీయం

డిఎస్సీకి ముందే అంతర్ జిల్లా బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: డిఎస్సీకి ముందే అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే 2016 నుండి మెడికల్ రీయింబర్స్‌మెంట్ అమలుచేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. ఓపెన్ కోటాలో స్థానికేతర జిల్లాల్లో నియామకమైన వారు భార్యభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న వారు గత నాలుగేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. 2012లో నిర్వహించిన అంతర్ జిల్లా బదిలీల్లో కూడా ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం ఇవ్వకపోవడం చేత ఆ జిల్లా నుండి బదిలీ కోరుకునే వారు గత ఆరేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. రాష్టప్రతి ఉత్తర్వులకు లోబడి పరస్పర బదిలీలు, భార్యభర్తల అంతర్‌జిల్లా బదిలీలు నిర్వహించే అవకాశం ఉందని, కనుక ఆదిలాబాద్ జిల్లా అన్ని జిల్లాల్లో ముందుగా ఈ బదిలీలు నిర్వహించిన తర్వాతనే ఖాళీల ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సీ ప్రకటన విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి చావ రవి కోరారు.