రాష్ట్రీయం

ఇక రెవెన్యూ సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 2: రెవెన్యూశాఖలో సంస్కరణలకు ఏపి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ భూములకు సంబంధించి కచ్చితమైన లెక్కలు తేలకపోవటానికి స్థానికంగా ఉండే అధికారులే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా ఉండే తహశీల్దార్లు, వీఆర్వోలను ఇతర మండలాలు, జిల్లాలకు బదిలీ చేయడం ద్వారా పాలనలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లను ఇతర జిల్లాలకు, స్వగ్రామంలో పనిచేస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి (వీఆర్వో)లను ఇతర మండలాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.పదోన్నతి బదిలీలు, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మాత్రమే ప్రస్తుతం ఇతర జిల్లాలకు (జోనల్ స్థాయి) బదిలీలు నిర్వహిస్తున్నారు. విభజన తరువాత నాలుగు రెవెన్యూ జోన్లు మిగిలాయి. శ్రీకాకుళం- విశాఖ జోన్-1, కృష్ణాతో కలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలు జోన్-2గా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్-3 పరిధిలో, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జోన్-4గా పరిగణిస్తున్నారు. జోన్ల వర్గీకరణతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, ఇతర రెవెన్యూ సంస్కరణకు చట్టసవరణలు అవసరమని చెబుతున్నారు. దాదాపు 70 శాతం మంది తహశీల్దార్లు, వీఆర్వోలు స్థానికంగా ఉన్నవారే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే పాలనాపరమైన వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10వేల 800 మంది వరకు వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరిలో అధికశాతం దాదాపు స్థానికంగా నివసించే వారే. భూముల లావాదేవీలు వీరి చేతిలోనే ఉన్నందున రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో స్థానికంగా ఉండే వీఆర్వోలకు అదే జిల్లాలో ఇతర మండలాల్లో పోస్టింగులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. వీఆర్వోలను ఇతర మండలాలకు బదిలీ చేసినందువల్ల తమకెలాంటి అభ్యంతరంలేదని, తహశీల్దార్ల బదిలీల వల్ల ప్రభుత్వానికి తలనొప్పులు ఎదురుకావడంతో పాటు ఆరోగ్యభద్రత ఉండదని ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం నేరుగా తహశీల్దార్ల నియామకాలు జరగటంలేదు. సుమారు 70 శాతం మంది సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతి పొందిన వారే ఉన్నారు. పదవీ విరమణకు సమీపంలో ఉండి ఇతర జిల్లాల్లో విధులు నిర్వర్తించాలంటే కష్టతరమని ఉద్యోగసంఘాల నేతలు వాదిస్తున్నారు. వీఆర్వోల విషయంలో కూడా స్థానికంగా ఉన్నవారికే సర్వేనెంబర్లతో భూములను గుర్తించడంతో పాటు భౌగోళికంగా హద్దులు తెలుస్తాయని, గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల స్థితిగతుల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. వీరిని మార్చి ఇతర ప్రాంతాలకు వేస్తే అవగాహన లోపిస్తుందని, దీనివల్ల అస్తవ్యస్తంగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో కొత్తగా 19 అర్బన్ మండలాల ఏర్పాటుతో పాటు పది రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. వీటిని ఏర్పాటుచేసి జిల్లాల్లోనే అంతర్గతంగా తహశీల్దార్ల బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 67 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో పది ఏర్పాటుచేస్తే పాలనా సౌలభ్యం కలుగుతుందని చెప్తున్నారు.

చిత్రం కంబోడియా రాయబారి, ఉగాండా హైకమిషనర్‌కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూపుతున్న సిఆర్‌డిఏ అధికారులు