రాష్ట్రీయం

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పరస్పరం సహకరించుకోవాలని కాలిఫోర్నియా గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా ఐటి శాఖ మంత్రి కె తారకరామారావుకాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశమయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సాంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమావేశానికి ప్రపంచంలో 13 ఫ్రావిన్స్‌ల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆహ్వానం అందింది. సమావేశంలో తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీ.. సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి బృందంతో కెటిఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఐటి కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను కెటిఆర్ సేల్స్ ఫోర్స్ బృందానికి వివరించారు. గురువారం మధ్యాహ్నం లింక్డ్‌ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్ మెన్‌తో కెటిఆర్ సమావేశమయ్యారు. భారతదేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళికలను మంత్రి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి హాఫ్‌మెన్‌ని ఆహ్వానించారు. ఈ మేరకు హాఫ్‌మెన్ వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్‌లో పర్యటిస్తానని చెప్పారు.

చిత్రం కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో భేటీ అయిన మంత్రి కెటిఆర్