రాష్ట్రీయం

పట్టిసం నుండి నిలిచిపోయిన నీటి తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 11: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి కృష్ణా డెల్టాకు నీటి తరలింపును శుక్రవారం నుండి నిలిపివేశారు. గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవడంతో శుక్రవారం ఉదయం మోటార్లను నిలిపివేశారు. దీనితో డెలివరీ పాయింటు నుండి నీటి తరలింపు నిలిచిపోయింది. సెప్టెంబర్ 10న ఒక మోటారుతో నీటి తోడకాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా అయి దు మోటార్ల ద్వారా 80 రోజుల్లో 3 టిఎంసిలకు పైగా నీటిని కృష్ణా డెల్టాకు తరలించారు. గోదావరి నీటిమట్టం కొద్ది రోజుల క్రితమే తగ్గిపోయినా అలాగే మోటార్లు తిరుగుతూ ఉండేవి. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసం ఎత్తిపోతల వద్ద తిరుగుతున్న మోటార్లను, డెలివరీ పాయింట్ వద్ద కుడి కాలువ ద్వారా కృష్ణాకు తరలి వెళ్తున్న గోదావరి నీటిని పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి ఈ సీజనుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు సిఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. కుడి కాలువ ద్వారా నీటిని పంపేందుకు తాత్కాలికంగా పనులు చేశామని, ప్రస్తుతం నీటిని నిలిపివేయడం వల్ల కుడికాలువ పూర్తిస్థాయిలో నిర్మించే పనులు చేపడతామని చెప్పారు. అలాగే పట్టిసం హెడ్ వర్క్స్ వద్ద 24 బావులు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 10 బావుల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 14 బావుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు చేపడుతున్నట్టు చెప్పారు.

మోటార్లు నిలిపివేయడంతో డెలివరీ పాయింట్ వద్ద నిలిచిపోయిన నీటి సరఫరా