రాష్ట్రీయం

హిందూజా విద్యుత్‌లో మాకూ వాటా: తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: విశాఖపట్నంలోని హిందూజా నేషనల్ పవర్ కార్పోరేషన్ నుంచి 1040 మెగావాట్ల విద్యుత్‌ను ఏపి డిస్కాంలే కొనుగోలు చేయాలంటూ ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 మెగావాట్ల హిందూజాకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ మొత్తం విద్యుత్‌ను ఏపి డిస్కాంలే వినియోగించుకోవాలని నిర్ణయించడంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపి ప్రభుత్వం గురువారం జీవో ఎంఎస్ 17ను జారీ చేసింది. ఇందులో ఏపి ఈస్ట్రన్ పవర్ డిస్కాం, సదరన్ డిస్కాం 1040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించే ధరకు అనుగుణంగా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కోరింది. ఈ నెల 18వ తేదీన ఏపిఇఆర్‌సి విద్యుత్ చార్జీ నిర్ణయించడంపై బహిరంగ విచారణ నిర్వహించనుంది.
ఇప్పటికే కృష్ణపట్నం విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వడంపై తొలుత ఆంధ్రప్రభుత్వం నిరాకరించింది. ఈ ప్లాంట్‌లోతమకు విద్యుత్ వాటా ఉందని తొలుత తెలంగాణ వాదించింది. కృష్ణపట్నం, హిందూజా ప్లాంట్లకు అనుమతులు, నిర్మాణం పనులు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. కృష్ణపట్నం, హిందూజాలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని డిస్కాంలు పెట్టుబడులు పెట్టాయి. ఏపి పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించి, ఇప్పుడు ఉత్పత్తికి వచ్చిన విద్యుత్ సంస్థల విద్యుత్‌ను గంపగుత్తగా తనదే అనడం విరుద్ధమని తెలంగాణ విద్యుత్ సంస్థలు వాదిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రాకు 46.11 శాతం పంపిణీ చేయాలి. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. హిందూజా ప్రమోటర్లపై ఆంధ్రప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మొత్తం విద్యుత్ తమకే విక్రయించాలనే ఏర్పాటు చేసిందనే అభియోగాలు ఉన్నాయి.