రాష్ట్రీయం

విద్యుత్ ఆదాకు ఏపిఇఇడిసి ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఆదా చేసేందుకు ఏపి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కాంలు, కేంద్రం పరిధిలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఏపి రాష్ట్ర ఎనర్జీ ఎఫీషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపిఇఇడిసి)ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు రాష్టప్రభుత్వం జీవో 18ను జారీ చేసింది. ఈ వివరాలను ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఆదా చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఎనర్జీ ఆడిట్ చేపట్టాలని, విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచేందుకు, విద్యుత్ ఆదా చేసే అవకాశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికలు అందించేందుకు, విద్యుత్ ఆదా చేసే విద్యుత్ పరికరాల తయారీ సంస్థలకు ఊతం ఇచ్చేందుకు, కనె్సల్టింగ్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ఎనర్జీ ఎఫీషియెన్సీ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్‌ను త్వరలో నెలకొల్పనున్నట్లు చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలతో ఎనర్జీ ఎఫీషియెన్సీ సంస్థ సంబంధాలను నెలకొల్పుకుని ఎప్పటికప్పుడు టెక్నాలజీని రాష్ట్రంలో అప్‌గ్రేడ్ చేస్తుందన్నారు. ఏపి సీడ్కో కార్యాలయం అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడలో ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్‌గా ఇంధన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఏపి ట్రాన్స్‌కో సిఎండి సిఇవోగా ఉంటారు.