తెలంగాణ

అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవతెలంగాణ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన జనజాతర సభకు అనుమతించొద్దంటూ లా విద్యార్థి రాహుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్శిటీలో రాజకీయ నాయకుల ప్రవేశం, బహిరంగ సభలతో యూనివర్శిటీ వాతావరణం కలుషితమవుతోందని, వర్శిటీలో ఎలాంటి సభలు నిర్వహించకూడదంటూ పిటిషనర్ రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషన్‌ను స్పెషల్ లంచ్‌మోషన్ కింద విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం స్పందిస్తూ వర్శిటీలో ఎలాంటి సభలకు అనుమతించొద్దంటూ ఆదేశించారు.
ఈ ఆదేశాలను వర్శిటీ రిజిస్ట్రార్, పోలీసులు తప్పనిసరిగా పాటించాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశానుసారం తాము వర్శిటీలో ఎలాంటి సభకు అనుమతించేది లేదంటూ ఓయూ రిజిస్ట్రార్ ఇ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. వారం రోజుల పాటు వర్శిటీలో ఎలాంటి సమావేశాలు బైక్ ర్యాలీలను నిర్వహించరాదని నిషేధం విధించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలావుండగా ఓయూలో జనజాతర సభ జరిగి తీరుతుందని, సభకు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరవుతారని టిడిపి నేత మధుసూదన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఓయూ గేట్లు మూసేసి చుట్టూ భద్రతా దళాలను మోహరింపజేశారు. కాగా తాము ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని విద్యార్థి జెఎసి స్పష్టం చేసింది. దీంతో జనజాతర సాంస్కృతిక కార్యక్రమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జనజాతర ముగింపు
దశలో హాజరైన రేవంత్ రెడ్డి
ఎట్టకేలకు జనజాతర సభకు టిడిపి నేత రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభకు రావద్దంటూ పోలీసులు సమాచారమిచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఆయనతోపాటు యెనె్న శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు సుధాకర్ కూడా జనజాతరలో పాల్గొన్నారు. తాను రెచ్చగొట్టే ప్రసంగాలేమీ చేయనని, కేవలం రెండు నిముషాలే మాట్లాడుతానంటూ పోలీసుల కళ్లు కప్పి రేవంత్‌రెడ్డి సభకు వచ్చినట్టు తెలిసింది. సభ చివరి దశలో ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్‌ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు జనజాతర సభకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు మల్లుభట్టి, శ్రీ్ధర్ బాబులను ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.