ఆంధ్రప్రదేశ్‌

ననె్నవరూ శాసించలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: గత 35 ఏళ్ల నుంచి మంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, జాతీయ రాజకీయాల్లో కీలకనేతగా పనిచేశారు కదా? అయినా ఇంకా ఈ వయసులో అలసిపోకుండా ఎలా ఉండగలుగుతున్నారు?
జ: ముందు మనసు నిర్మలంగా ఉండాలి. అత్యాశ ఉండకూడదు. మనం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న భావనే నాకు ఆక్సిజన్. అదే నన్ను నిరంతరం నడిపిస్తుంది. నేను తినే తిండి చాలా తక్కువ. మామూలు బెడ్ మీదనే పడుకుంటా. ఎలాంటి అవినీతి అక్రమాలు చేయకపోతే హాయిగా నిద్రపడుతుంది.
ప్ర: కానీ మిగిలిన వారు కూడా మీలాగే పనిచేయాలనుకోవడం ఎంత వరకు సబబు?
జ: గతంలో టెక్నాలజీ అందుబాటులో లేదు. 80 శాతం శారీరక శ్రమ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దానిని వాడుకుంటే 80 శాతం శారీరక శ్రమ తప్పి, 20 శాతం మెదడుతో పనిచేయవచ్చు. నేనూ మనిషినే రోబోను కాదు. ఇప్పుడు చూడండి. 43 లక్షల పెన్షన్లు ఇప్పటికి పంపిణీ చేశామని వచ్చింది. అదే పాతరోజుల్లో ఆ లెక్కలు రావడానికే కొన్ని రోజులు పట్టేవి కదా?
ప్ర: మీరు చెప్పే ప్రజారాజధానికి ఎనే్నళ్లు పడుతుంది?
జ: ఇది రెండేళ్ల బిడ్డ. చిత్తశుద్ధితో చేసే ప్రారంభం ముఖ్యం. మనం మోసానికి గురయిన వాళ్లం. దగాపడిన వాళ్లం. అందుకే రాజధానిపై ముందు నుంచి మేం ప్రణాళికా బద్ధంగా వెళ్లాం. శివరామకృష్ణన్ కమిటీ కలబెట్టిపోయింది. కానీ నేను గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని వస్తుందని ప్రకటించా. రైతులు నా మీద నమ్మకంతో 34 వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. సింగపూర్ వాళ్లు మంచి డిజైన్లు ఇచ్చారు. దీన్ని ప్రమోట్ చేయాల్సి ఉంది. ఒకటి రెండు ఐకాన్ టవర్స్ పెట్టాల్సి ఉంది. రోడ్డు వేసినంత మాత్రాన సరిపోదు. పెట్టుబడులు రావాలి. వాళ్లు మన ప్రొసీజర్లు ఫాలో కావాలి. అందుకే నేను దేశాలు తిరుగుతూ, అమరావతిపై భరోసా కల్పిస్తున్నా. దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. విమానాల్లో వద్దంటారు. మరి నడిచిపోవాలా? ఇక్కడ సమయపాలన ముఖ్యం. భూముల అమ్మకాల్లో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అసలు రైతులు ఇచ్చిందే 34 వేల ఎకరాలు. ఇంకా వారికి ఏమీ ఇవ్వలేదు. మరి కుంభకోణం ఎక్కడ జరిగిందో మీరే చెప్పండి?
ప్ర: ప్రపంచమంతా మనవైపు చూస్తుంటే మీరు ప్రపంచం వైపు చూస్తున్నారన్న విమర్శ ఉంది.
జ: ఏం చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు అందరూ సింగపూర్‌కు ఎందుకు వెళుతున్నారండీ? విజయవాడ, హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు? టెక్నాలజీని ఎక్కడున్నా వాడుకోవాలి. చైనాను చూడండి. ఇక్కడ మూడేళ్లలో అయ్యే బిల్డింగులు చైనా టెక్నాలజీతో మూడు, నాలుగు నెలల్లోనే కట్టవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు.
ప్ర: అమరావతి తాత్కాలిక సచివాలయమయిన వెలగపూడిలో అన్ని సౌకర్యాలు కల్పించేవరకూ రాబోమని ఉద్యోగులు చెబుతున్నారు కదా?
జ: నేను ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నా. ఉద్యోగులంతా రావలసిందే. లేకపోతే ఊరుకునేది లేదు. దీనిపై ఇక ఎలాంటి చర్చలు లేవు. చివరకు సీఎస్ చెప్పినా వినేదిలేదు. సాకులు సహించేది లేదు. వాదనలు వినేదిలేదు. పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. ప్రజల కోసం అంతా రావలసిందే. ఇక్కడ ప్రజలు మీ కంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు. ఆదాయం లేదు. సమస్యల్లో ఉన్నారు. నా హయాంలో తొమ్మిదేళ్లు ఉద్యోగులు ఎలా ఉండేవారో గుర్తుంచుకోండి. వారికి కావలసిన ఫిట్‌మెంట్ ఇచ్చాం. సమస్యలుంటే చర్చించమన్నాం. తరలివచ్చే విషయంలో వ్యతిరేకంగా ఉంటే సహించేది లేదు. ఇది ప్రజా ప్రభుత్వం. నన్ను ఎవరూ డిక్టేట్ చేయలేరు. ప్రజలు మాత్రమే డిక్టేట్ చేయగలరు. స్పెషల్ కేసులేమైనా ఉంటే తప్ప, మిగిలిన వారంతా విజయవాడకు రావలసిందే. ఇందులో నేను క్లియర్‌గా ఉన్నా.
ప్ర: అంటే వారి వెనుక ఎవరైనా ఉన్నారని మీ అనుమానమా?
జ: ఒకటి రెండు పార్టీలు ఉంటే ఉండవచ్చు.
ప్ర: పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది?
జ; డబ్బులు లేవు. ప్రభుత్వం తరఫున ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాం. అవి రావలసి ఉంది. నాబార్డు నుంచి రుణం ఇస్తామంటున్నారు. అనుకున్న సమయానికే ప్రారంభం చేయాలన్న పట్టుదలతో ఉన్నాం. అందుకే కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాం.
ప్ర: బిజెపి-కేంద్రప్రభుత్వంతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? కింది స్ధాయిలో రెండు పార్టీల మధ్య విమర్శలు వినిపిస్తున్నాయి కదా?
జ: ఒక పార్టీకి మరో పార్టీకి, కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య సంబంధాలు ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఇద్దరం కలసి ఎన్నికలకు వెళ్లాం. హామీలిచ్చాం. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అందుకే వాళ్లు అడగిన వెంటనే ఒక ఎంపి సీటు ఇచ్చాం. వాళ్లతో మంచిగా ఉంటూ నిధులు సాధించాలన్నదే నా లక్ష్యం. కొంతమంది నన్ను కేంద్రం నుంచి బయటకు రమ్మని మాట్లాడుతున్నారు. బయటకు వస్తే ఏమవుతుంది? ఒకవేళ వస్తే వాళ్లకు బుద్ధి లేకపోతే మీకేమయిందని నన్ను విమర్శించరా? కేంద్రంతో సత్సంబంధాలు పెంచుకుని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.
ప్ర: ప్రత్యేక హోదాపై మీరు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని వైసీపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి కదా?
జ: సెంటిమెంట్ నిజం. వాస్తవం వేరు. ప్రత్యేక హోదా వస్తే మంచిదే. కానీ, ఆ హోదా తీసుకున్న రాష్ట్రాలకు ఏమి ఒరిగిందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా? రాష్ట్రానికి కావలసిన పనులు చేయించుకునేందుకే నేను కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నా. అసలు నన్ను విమర్శించేవారి వల్లనే కదా రాష్ట్రం భ్రష్టుపట్టింది. కాంగ్రెస్ వాళ్లు అప్పుడు ఇద్దరినీ కూర్చోబెట్టి సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు నాకు ఇలా అడుక్కునే పరిస్థితి ఉండేదా? కాంగ్రెస్, జగన్, కేసీఆర్ కుట్ర వల్లే కదా జరిగింది. రాష్ట్రం ఇస్తే పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ ఓపెన్‌గానే చెప్పారు కదా?
ప్ర: గత ఎన్నికల్లో మీరు ‘నేను సీఎంగా ఉన్నపుడు కార్యకర్తలను విస్మరించా. ఈసారి అధికారంలోకి వస్తే వారికే ప్రాధాన్యం ఇస్తామ’న్నారు. కానీ రెండేళ్లయినా తమకు పదవులు లేవని, తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కదా?
జ: అలా అని ఎవరు చెప్పారు? కార్పొరేషన్ చైర్మన్లు మూడు, నాలుగు తప్ప అన్నీ ఇచ్చాం కదా? 80 శాతం మార్కెట్ కమిటీలు పూర్తి చేశాం. కార్యకర్తలకు 2 లక్షల ఇన్సూరెన్సు ఇస్తున్నాం. వ్యాపారానికి పెట్టుబడుల కోసం రుణాలిస్తున్నాం. ఏ పార్టీ ఇంతకంటే ఇచ్చిందో చెప్పమనండి.
ప్ర: గతంలో ఎప్పుడూ లేనంతగా మీరు కులాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కారణం? కాపులకు బీసీ రిజర్వేషన్లను మీ పార్టీ ఎమ్మెల్యే కృష్ణయ్య కూడా వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్నారు కదా?
జ: కులాలని కాదు. సమాజంలో ఎవరైనా ఆర్ధికంగా వెనుకబడి ఉంటే వారిని ఆదుకోవాలి. ఎవరూ రోడ్డెక్కాల్సిన పనిలేదు. నాది పేద కులం. అందుకే కాపులకు, బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ఇచ్చాం. ఓసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటుచేయబోతున్నాం. బీసీలకు మా కంటే ఎవరిచ్చారండి. కాంగ్రెస్ నయాపైసా ఇవ్వలేదు కదా? కాపులను బీసీల్లో చేర్చడం వల్ల నష్టం రాదు.
ప్ర: వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు, మీ పాత నేతల మధ్య జరుగుతున్న ఘర్షణల సంగతి ఏమిటి?
జ: దీన్ని సహించను. కొంతమంది నాలుగుసార్లు ఓడిపోయినా తామే ఉండాలనుకుంటున్నారు. పార్టీ ప్రభుత్వంలో ఉండాలి. అక్కడ తాము మాత్రం పెత్తనం చేయాలనుకుంటున్నారు. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా దాన్ని ఫాలో కావలసిందే.
ప్ర: యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఢిల్లీకి వెళితే ప్రధాని సహా, మంత్రులెవరూ మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ, మీ ప్రత్యర్ధి జగన్‌కు మాత్రం కేంద్రం తరచూ అపాయింట్‌మెంట్లు ఇస్తోంది. దీన్ని ఎలా చూస్తారు?
జ: రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి. మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ కోసం రెండుసార్లు ప్రయత్నించా. ఇవ్వలేదు. దానితో ఇక మీ ముఖం చూడనన్నా. మళ్లీ ఇంతవరకూ ఆయన ముఖం చూడలేదు.
ప్ర: మీ మీద వస్తున్న విమర్శల గురించి..?
జ: ఇది ప్రజాస్వామ్యం. ఆర్ధిక ఉగ్రవాదులు, క్రిమినల్స్, 13 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వాళ్లు కూడా నన్ను విమర్శిస్తున్నారు. అయినా వారిని భరించాల్సి వస్తోంది. నా మీద వైఎస్ ఎన్నో కమిషన్లు వేశారు. కోర్టుకు వెళ్లారు. ఏమయింది? నా మీద అతను (జగన్) ఏం మాట్లాడారో మీరు చూశారు. చాలా బాధాకరంగా ఉంది. మనం ఎటు పోతున్నాం? పరిటాల రవి హత్య తర్వాత జరిగిన అసెంబ్లీలో నాకు చాలా ఆగ్రహం వచ్చింది. అప్పుడు కూడా నేను వైఎస్‌ను ఇలా బాధ్యత, సంస్కారం మరిచి తిట్టలేదు. అది నా సంస్కారం. క్రిమినల్స్, దురాశపరులు, ఆర్ధిక ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది.
ప్ర: తెలంగాణ మాదిరిగా ఇక్కడ కొత్త జిల్లాలుంటాయా?
జ: ఎందుకు ఇప్పుడున్న సమస్యలతోనే అల్లాడుతుంటే, మళ్లీ అదొక కొత్త సమస్య ఎందుకు? ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి.

మార్తి సుబ్రహ్మణ్యం