ఆంధ్రప్రదేశ్‌

దిష్టిబొమ్మ దగ్ధం ఘటనలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేటర్), జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. స్థానిక రమేష్ హాస్పటల్ సెంటర్లోని జాతీయ రహదారిపై టిడిపి శ్రేణులు 8వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు నేతృత్వంలో వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించగా ఊహించని విధంగా కార్పొరేటర్ జాస్తి దిష్టిబొమ్మ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. జగన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం సమాచారం తెలుసుకొన్న నగర పోలీసులు ఆ చర్యలను అడ్డుకొనే క్రమంలో బొమ్మను స్వాధీనం చేసుకోబోతుండగా ఈక్రమంలో జాస్తి దిష్టి బొమ్మను వాటేసుకొని పోలీసు చర్యలను నిలువరించబోయారు. కాగా అప్పటికే పెట్రోల్ పోసిన బొమ్మకు కార్యకర్తలు నిప్పంటించగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్ని కీలల్లో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు చిక్కుకుపోయారు. ఎగిసి పడిన మంటలు తీవ్రంగా వ్యాపించడంతో తీవ్ర గాయాలపాలవ్వగా ఆయనను పార్టీ నేతలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం తప్పించారు. జగన్ దిష్టిబొమ్మ దహన ఘటనలో గాయపడ్డ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావును నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పలువురు పరామర్శించారు.

శ్రీకాకుళంలో కుంభవృష్టి

శ్రీకాకుళం, జూన్ 3: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో శుక్రవారం గంటన్నరసేపు కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు పెద్దపెద్ద శబ్దాలతో జిల్లా ప్రజలు ఉలిక్కి పడేటట్టు వర్షం మేల్కొలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లా అంతటా కుండపోతవర్షం కురిసింది. తీవ్ర ఉక్కపోతకు గురిచేసిన వాతావరణం అప్పటికప్పుడే మేఘామృతమై ఉరుములు, గాలులతో భారీవర్షం పడింది. పిడుగుల బీభత్సాన్ని వర్షం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమదాలవలస మండలం పెద్దజొన్నవలస గ్రామానికి చెందిన కోట రాజబాబు(18), వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన రైతు బత్తిన రాము(50) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. రాజబాబు స్నానం చేసి ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లాలో లావేరు మండలంలో 68.2 మిమీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, ఆమదాలవలసలో 57, శ్రీకాకుళంలో 56.4, సరుబుజ్జిలి 53.8, ఇచ్ఛాపురం 66.8, కవిటిలో 50.4 మి.మీల వర్షం కురిసింది. ఇప్పుడిప్పుడే రైతులు నారుమడులు సిద్ధం చేసి విత్తనాల కోసం ఎదురుచూస్తున్న వారంతా వర్షం పడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.