తెలంగాణ

జనగామకు యాదాద్రే దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 3: జిల్లా అవుతుందనుకున్న జనగామ చివరకు కొత్తగా ఏర్పాటు కానున్న యాదాద్రిలోనే కలవనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వం కూడా జనగామకు బదులు మహబూబాబాద్‌ను జిల్లాగా చేసేందుకు మొగ్గుచూపుతోంది. వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలని ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు నియోజకవర్గాలను జనగామలో కలిపి జనగామను జిల్లాగా చేయాలని భావించారు. అయితే మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. పెద్ద ఎత్తున రైల్‌రోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధం చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో జనగామకు బదులు మహబూబాబాద్‌నే జిల్లాగా చేయాలని నిర్ణయానికి వచ్చింది. అయితే జనగామ జిల్లా చేయడానికి అన్ని హంగులు ఉన్నప్పటికి మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు నియోజకవర్గ ప్రజలే కాకుండా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన ప్రజలు కూడా జనగామలో కలిసేందుకు సుముఖంగా లేరు. కనీసం జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్న చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన ప్రజలు కూడా తమను కొత్తగా ఏర్పాటయ్యే సిద్దిపేట జిల్లాలోనే కలపాలని పట్టుపడుతున్నారు. జనగామ జిల్లా చేయడానికి ఎవరికి ఇష్టం లేకపోవడంతో ఇక మహబూబాబాద్ జిల్లాకే ప్రభుత్వం మొగ్గుచూపుతుంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ఉన్న జనగామను జిల్లాగా చేయాలని మొదట్లో అనుకున్నప్పటికి అందులో కలిసేందుకు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌ను జిల్లాగా చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేయడంతో ఇక జనగామ జిల్లా అయ్యే ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రే స్వయంగా ఈ విషయం ప్రకటించడంతో జనగామ జిల్లా ఏర్పాటు కాదనే సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా జనగామలో ఉన్న ఆర్డిఓ కార్యాలయాన్ని పరిపాలన సౌలభ్యం కోసం ఆలేరుకు తరలించే ఆలోచన కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో జనగామ జెఎసి నాయకులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జనగామ జిల్లా కేంద్రం కావడానికి అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు చేయడం లేదంటూ గత వారం రోజులుగా ఆందోళనలు ఉద్ధృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిమాత్రం జిల్లా ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక ఎంపి, స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు మాత్రం జనగామను జిల్లా చేయవద్దంటూ అడ్డుపడుతున్నట్లు సమాచారం. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలంతా తమను వరంగల్ జిల్లాలోనే ఉంచాలని పట్టుపడుతున్నారు. అయితే జనగామ ప్రాంతం జిల్లా చేయడానికి అన్ని విధాలా అనువుగా ఉంది. జిల్లాలోనే మొదటి మున్సిపల్ పురపాలక సంఘం కావడమే కాకుండా పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయం కూడా ఉంది. మరోవైపు తాగునీరు అందించేందుకు దేవాదుల నీరు అందుబాటులో ఉంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు దాదాపు 200 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అన్ని విధాలా అనువుగా ఉన్న జనగామను జిల్లాగా చేయాలని అన్ని పార్టీల నాయకులు జెఎసిగా ఏర్పాటై ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయనున్నారు.