రాష్ట్రీయం

టాప్‌లో ఉందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: ఆంధ్రలో సాలీనా పదివేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఆదా, అందరికీ విద్యుత్ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలవాలని, నిధుల కొరత లేదని ప్రకటించారు. సోమవారం నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రాష్ట్రంలోని విద్యుత్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 12900 పంచాయితీల్లో ఎల్‌ఇడి బల్బులు అమర్చనున్నట్టు చెప్పారు. విద్యుత్ పొదుపును మహోద్యమంగా చేపట్టాలన్నారు. ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ పొదుపునకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో జల విద్యుదుత్పత్తి కలగా మిగిలిపోతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో 22 ఎంయు విద్యుత్ లోటు ఉండేదన్నారు. ఇప్పుడు మిగులు విద్యుత్ సాధించామన్నారు. విద్యుత్ కోతలవల్ల దాదాపు 25వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు 24 గంటలు పనిచేస్తూ కళకళలాడుతున్నాయన్నారు. దేశంలో అగ్రస్థానంలో నిలిచే విధంగా పదివేల మెగావాట్ల సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికితోడు 4000 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నరు. ఇంధన పొదుపు, సంరక్షణలో ఐదు విభాగాల్లో అవార్డులు సాధించడాన్ని అభినందించారు. ఇంటింటికీ స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు ఇచ్చి కరెంటు బిల్లుల ఖర్చును తగ్గిస్తామన్నారు. దేశం మొత్తం మీద 3.70 కోట్ల ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేస్తే, ఒక ఆంధ్రలో 1.25 కోట్ల బల్బులు పంపిణీ చేశామన్నారు. వచ్చే మార్చికి కోటి కుటుంబాలకు రెండు కోట్ల ఎల్‌ఇడి బల్బుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. గృహ విద్యుత్ రంగంలో 1200 ఎంయు విద్యుత్‌ను ఆదా చేస్తామన్నారు. ఒక్క వ్యవసాయ రంగంలోనే 30 శాతం విద్యుత్ ఆదా చేయవచ్చని అంచనా వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న నాసిరకం పంపుసెట్ల స్థానంలో విద్యుత్ సమర్ధ వినియోగ పంపుసెట్లతో మార్చనున్నట్టు చెప్పారు. రైతులపై ఏమాత్రం భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టెలికాన్ఫరెన్సులో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.