రాష్ట్రీయం

ప్రజా స్పందన భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 4: రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అధికారుల కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజల నుండి 90శాతం సంతృప్తికర స్పందన వస్తోందన్నారు. శనివారం ఆయన తన నివాస గృహం ఉండవల్లి నుండి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నవనిర్మాణ దీక్ష సందర్భంలో సంక్షేమ, అభివృద్ధిపై వారినుంచి లభిస్తున్న స్పందనతో మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరికో వనం కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని, దీన్ని మరింత విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రతి నియోజకవర్గంలో 1000 మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. బహిరంగా విసర్జన రహిత గ్రామాలకు ఐదు లక్షలు, వంద పంటకుంటలు తవ్విన గ్రామాలకు నాలుగు
లక్షలు, ఇంటికో ఇంకుడుగుంత సాధించిన గ్రామానికి రెండు లక్షలు, 50 వర్మికంపోస్టు యూనిట్లు ఉన్న మహిళా సంఘాలకు రెండు లక్షలు, మూడు కిలోమీటర్ల పొడవునా లేదా 1200 మొక్కలు నాటి పెంచితే రెండు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామంలో నాలుగు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలునాటి వాటిని పెంచితే రెండు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై మరింత చర్చ జరగాలి
2014 జూన్ 4నాటి పరిస్థితి ఏమిటి, ఇప్పటి పరిస్థితి ఏమిటి అన్నదానిపై ప్రజల్లో చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. దీనికి అనుకూల వాతావరణం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు సమన్వయంతో పని చేయాలన్నారు. రైతులు క్రాప్ హాలీడేలు, పవర్ హాలీడేలతో ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయిన దయనీయ స్థితి నుండి నేడు 24 గంటలపాటు విద్యుత్‌ను అందించే స్థితికి తెదేపా ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఈ నెల 8న నిర్వహించే మహాసంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సుమారు 6500 మంది ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పాల్గొన్నారు.