రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి-సి 29కు నేటినుంచి కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 13: భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన పిఎస్‌ఎల్‌వి- సి 29 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి 16న సాయంత్రం 6 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగం జరగనుంది. రాకెట్ ద్వారా సింగపూర్ దేశానికి చెందిన 6 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం ఆదివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో షార్ డైరెక్టర్ ఉన్హికృష్ణన్‌తో పాటు పలువురు శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు షార్ డైరెక్టర్ అధ్యక్షతన సమావేశమై రాకెట్ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం ఉదయం రాకెట్ ప్రీ కౌంట్‌డౌన్‌ను శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి జరిగే రాకెట్ ప్రయోగం ద్వారా ఒకేసారి 6 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇది వాణిజ్యరంగ ప్రయోగం కావడంతో శాస్తవ్రేత్తలు విజయవంతం చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌కు ఇంధనాన్ని నింపి పనితీరు పరిశీలిస్తారు. రాకెట్‌లోని అన్ని దశలు పనిచేస్తే ప్రయోగానికి 8 గంటల ముందు రాకెట్‌కు విద్యుత్ సరఫరా ఇస్తారు. ప్రయోగానికి 59 గంటల ముందు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగిన అనంతరం 16న సాయంత్రం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది.

చిత్రం.. లెలూస్ ఉపగ్రహం