రాష్ట్రీయం

ఏపి అభ్యర్థనలను ప్రత్యేకంగా పరిగణిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 4: రైల్వే అభివృద్ధి పనులకు సంబంధించి ఏపి అభ్యర్థనలను ప్రత్యేకంగా పరిగణించి వాటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు హామీ ఇచ్చారు. రూ.10కోట్లతో తిరుచానూరులో చేపట్టనున్న నూతన రైల్వే క్రాసింగ్ పనులకు తిరుపతి రైల్వే స్టేషన్లో రిమోట్ కంట్రోల్ ద్వారా రైల్వేమంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన జరిగిన తర్వాత రైల్వేపరంగా ఆంధ్రరాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగానే తిరుపతి నుంచి ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు పుష్కలంగా ఉండడంతో రైల్వేశాఖ పనులను కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రోజుకు నాలుగు కిలోమీటర్లు మేర మాత్రమే రైల్వే పనులు జరిగేవన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రోజుకు 7.8 కిలోమీటర్లు పనులు చేయించామన్నారు. అయితే ఈ ఏడాది నుంచి రోజుకు 19 కిలోమీటర్లు మేర పనులు చేయించి రెండేళ్ళలో రైల్వేశాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి టిటిడి అధికారులతో ప్రత్యేకంగా చర్చించి చేపట్టాల్సిన ప్రణాళికలపై నెల రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రరాష్ట్రం నుంచి తనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సురేష్ ప్రభు అన్నారు. ఆ రుణం తీర్చుకోవడానికి తన వంతు సేవలు అందిస్తానని చెప్పారు. ఈ ఈకార్యక్రమంలో రాష్టమ్రంత్రులు బొజ్జల, కామినేని, నర్సాపురం, రాజమహేంద్రవరం, చిత్తూరు, తిరుపతి ఎంపిలు, టిటిడి చైర్మన్ చదలవాడ, ఇఓ పాల్గొని ప్రసంగించారు.

chitram తిరుపతిలో శనివారం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు