రాష్ట్రీయం

వసతులుంటే వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విజయవాడ, జూన్ 6: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు విజయవాడ రావాలంటే వౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగుల సంఘం నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ రావడానికి ఇష్టం లేని ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, కొంత మంది వ్యాఖ్యలను అందరికీ ఆపాదించడం సమంజసం కాదని అన్నారు. వౌలిక వసతులు ఏర్పడ్డాక అక్కడికి వచ్చి పనిచేస్తామని తాము ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా చెప్పామని, అంత మాత్రాన ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టో వివాదాస్పద వ్యాఖ్య లు చేసినట్టో పరిగణించరాదని అన్నారు. తామెన్నడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాధం ఏర్పడుతోందని అన్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాల సదుపాయం ప్రభుత్వం కల్పించిందని, 2016 ఆగస్టు 31 నాటికి భవనాల సమీకరణ, గుర్తింపు, వెలగపూడిలో కొన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తవుతుంది కనుక ఆనాటికి ఉద్యోగులు అంతా విజయవాడకు తరలివెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెలగపూడిలో నిర్మిస్తున్న భవనాల్లో సచివాలయం ఉంటుందని, భవనాలు పూర్తికాగానే విజయవాడ, గుంటూరు వెళ్లేందుకు అంతా సిద్ధమని అన్నారు. రాజధాని అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే హెచ్‌ఓడిలు ఇక్కడికి రాలేకపోతున్నారని అశోక్‌బాబు చెప్పారు. హెచ్‌ఓడిలు ఆగస్ట్ 31వ తేదీలోగా దశలవారీగా వస్తారన్నారు. ఇప్పటికే కొన్ని హెచ్‌ఓడి కార్యాలయాలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. 80 శాతం హెచ్‌ఓడి ఉద్యోగులు విజయవాడ రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేవలం ఇంటర్మీడియట్, ఎంసెట్ విద్యార్థులకు మాత్ర మే ‘స్థానికత’ సమస్య ఉంటుందన్నారు. వారి తల్లిదండ్రులు విజయవాడ వచ్చిన తరువాతైనా దానిగురించి ఆలోచించవచ్చని, ఇప్పుడు ఆందోళన అవసరం లేదన్నారు.
అధికారులనుంచే ఇబ్బందులు
రెవెన్యూ ఎంప్లారుూస్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు, ముఖ్యమంత్రికి మధ్య ఉన్నతాధికారులు అగాథం సృష్టిస్తున్నారని అన్నారు. తమను దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు తరువాత వస్తారని, ముందు హెచ్‌ఓడిలు వెళ్లాలని సిఎస్ చెప్పడం శోచనీయమన్నారు.

చిత్రం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అశోక్‌బాబు