రాష్ట్రీయం

ఎమ్మెల్యేలకు ఆఫీసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: రాష్టవ్య్రాప్తంగా 119 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి తక్షణం స్థల సేకరణ జరిపి, డిసెంబర్‌లో టెండర్లు పిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలకు తమ నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. నిధులు కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నియోజక వర్గంలో సొంత ఇళ్లు ఉంటే అదే నియోజక వర్గ ప్రజలకు కార్యాలయంగా మారింది. ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలుంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఒక కార్యాలయమంటూ ఉంటే అక్కడికి నియోజక వర్గ ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు అందజేసే వినతిపత్రాలను తీసుకొని రికార్డు చేసే అవకాశం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు స్థలాలను గుర్తించి, డిసెంబర్‌లో టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులను సోమవారం ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేల నివాస గృహ సముదాయం పనులు ఎంతవరకు పూర్తయ్యాయో మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ చివరి నాటికి వీటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉపయోగపడే విధంగా గృహ సముదాయం నిర్మిస్తున్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరానికి నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించిన పనుల్లో వేగం పెంచాలని తుమ్మల సూచించారు.
2014-15లో పిరియాడికల్ రెన్యూవల్ కింద 756 పనులకు అనుమతులు ఇచ్చారు. 5,407కిలో మీటర్ల మేరకు పనులను 1703 కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లను కలుపుతూ 139 రహదారులకు అనుమతి ఇచ్చారు. 2571 కోట్ల రూపాయల వ్యయంతో 1970 కిలో మీటర్ల మేరకు ఈ రోడ్లను నిర్మించాలి. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తి కావాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సింగిల్‌లైన్ రహదారులను డబుల్ లైన్ రహదారులుగా మార్చడానికి 258 పనులకు అనుమతి ఇచ్చారు. 3953 కోట్ల వ్యయంతో 3020 కిలో మీటర్ల పనులు చేపడతారు. 1718 కోట్ల రూపాయల వ్యయంతో 358 వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో పురోగతిని తుమ్మల సమీక్షించారు. 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రోడ్లు భవనాల శాఖ చేపట్టిన రోడ్ల పనులన్నీ పూర్తి కావాలని ఆ మేరకు ప్రణాళిక రూపొందించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావుఅధికారులను ఆదేశించారు.
కేంద్ర మంత్రి వచ్చేలోగా...
కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మంత్రి వచ్చే వారంలో వస్తున్నందున ఆయనతో భేటీ అయ్యే ముందు జాతీయ రహదారులు సమగ్ర ప్రణాళిక నివేదిక ( డిపిఆర్) సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
రహదారుల నిర్మాణంలో తలెత్తే భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ, విద్యుత్, అటవీ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులతో సమావేశమై ఆటంకాలను తొలగించాలని సూచించారు. కబ్జాకు గురైన ఆర్ అండ్ బి స్థలాలను వెంటనే గుర్తించి రైట్ ఆఫ్ వే చట్టం కింద వాటి సరిహద్దులు గుర్తించాలని సూచించారు. తిరిగి కబ్జాలకు గురి కాకుండా శాశ్వత చర్యలు చేపట్టి, రికార్డుల్లో పొందు పరచాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.