రాష్ట్రీయం

జూనియర్ ఆర్టిస్టు కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: జూనియర్ ఆర్టిస్టు కిడ్నాప్‌కు గురైన సంఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ సిఐ వెంకటరెడ్డి కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. కృష్ణానగర్‌లో నివాసముంటున్న జూనియర్ ఆర్టిస్టు శ్రీనివాసరావు (48) గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడంటూ భయపెట్టి, తాము పోలీసులం, జర్నలిస్టులం అంటూ బెదిరించి గతనెల 31వ తేదీన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు డబ్బులివ్వకుంటే హతమార్చుతామని కూడా భయపెట్టారు. ఓ టివి చానల్‌లో పనిచేసే మహమ్మద్ జలీల్ (30) అతని డ్రైవర్ సంజీవ్‌రెడ్డితోపాటు ముగ్గురు స్నేహితులు, ఇద్దరు మహిళలతో కూడిన బృందం శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి చింతల్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అతను ఇంటికి చేరుకున్నాడు. మహమ్మద్ జలీల్, డ్రైవర్ సంజీవరెడ్డి తిరిగి కృష్ణారావు ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో కలత చెందిన శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహమ్మద్ జలీల్‌తోపాటు అతని డ్రైవర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జలీల్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులు, ఇద్దరు మహిళల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.