రాష్ట్రీయం

గ్లోబల్ ఆసుపత్రిపై చర్య తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: గ్లోబల్ ఆసుపత్రిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సుచిత్ర, ఎంఎన్ రెడ్డినగర్‌లోని నిఖిల్‌రెడ్డిని పరామర్శించారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి నిఖిల్‌రెడ్డిని రెండు నెలల్లో నడిపిస్తామని మోసపూరిత మాటలు చెప్పి వైద్య వృత్తికే కళంకం తెచ్చిన డాక్టర్ల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేసిన డాక్టర్ పట్టాని రద్దు చేసేలా చర్యలు చేపట్టి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా కృషి చేస్తామని అన్నారు. డాక్టర్ల అనాలోచిత చర్యలతోనే నిఖిల్‌రెడ్డికి ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ ఆసుపత్రి డబ్బులకి ఆశపడే ఎత్తు పెరిగేందుకు కాళ్లను తొలగించారని దుయ్యబట్టారు. వైద్య నియమాలను తుంగలో తొక్కిన గ్లోబల్ ఆసుపత్రిపై కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రుల దృష్టికి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లి నిఖిల్‌రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.

చిత్రం సోమవారం హైదరాబాద్‌లో నిఖిల్‌రెడ్డిని ఆయన నివాసంలో పరామర్శిస్తున్న బిజెపి తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి