రాష్ట్రీయం

ఎందుకీ ఉదాసీనత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: దివంగత నందమూరి తారక రామారావు మానస పుత్రిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆశాదీపమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే ఉన్నతాధికారులు ఎంతో ఉదాశీనం, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, హిందీ అకాడమీ మాజీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిప్పులు చెరిగారు. నూతన రాజధాని నిర్మాణం కోసం ఎంతో పరితపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరచుకుని విద్యామంత్రి, అధికారులను దారిలోకి తెచ్చుకోని పక్షంలో ఆయన అవమానపాలు కావటమే గాక అభాసుపాలవుతారని పైగా ప్రస్తుతం ఆయన పడుతున్న శ్రమ అంతా బూడిదపాలు కాగలదంటూ హెచ్చరించారు. ఆదివారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో యార్లగడ్డ మాట్లాడారు. తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో కూచిపూడి, రాజమండ్రి, శ్రీశైలంలో మూడు ప్రాంతీయ కేంద్రాలున్నాయని వీటిలో 600 మంది పైగా విద్యార్థులున్నారని తెలిపారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరిధిలోని స్టడీ సెంటర్లలో వేలాదిమంది అభ్యసిస్తున్నారని ఈ రెండింటిలో కల్సి 600 మంది పైగా అధ్యాపకులు, సిబ్బంది ఉండగా ఆరు మాసాల నుంచి నెలవారీ జీతాలకు కూడా నోచుకోటం లేదన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని కోరగా ఈ రెండింటిపై తెలంగాణ అధికారం ఉందంటూ చెప్పటంతో రాష్ట్ర ప్రభత్వుం జీతభత్యాలపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తే తక్షణం నాలుగు కోట్లు విడుదల చేయాలని సెప్టెంబర్ 4న ఆదేశాలు జారీచేస్తే రాష్ట్ర ఉన్నత విద్యామండలి నవంబర్ 23న జీవో జారీ చేయడం చూసి ముఖ్యమంత్రి కాదు.. హైకోర్టు ఈ జాప్యాన్ని ప్రశ్నిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై అక్షింతలు వేసిందన్నారు. ఇదిలా ఉండగా హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనె ల 9న జరిగిన విచారణకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది గైర్హాజరు కావటంతో కేసు విచారణ జనవరి 4వ తేదీకి వాయిదా పడిందన్నారు. అస లు ఈ కేసు విచారణ జాప్యం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ న్యాయవాది గైర్హాజరైతే తమ న్యాయవాది గైర్హాజరు కావటంలో ఆంతర్యం ఏమిటని యార్లగడ్డ ప్రశ్నించారు. అసలు ఈ విషయాన్ని విద్యామంత్రి గాని, సిఎం గాని పట్టించుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదన్నారు. నిధుల కోసం సిఎం తరచూ ఢిల్లీ వెళ్లి ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా తిరుగుతున్నారు. కాని అసలు వీటి విషయాన్ని ఎందుకు పట్టించుకోటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం 10వ షెడ్యూలులో ఇలాంటి మొత్తం 107 విద్యాసంస్థలు ఏర్పాటుపై స్పష్టంగా చెప్పబడింది. చెన్నారెడ్డి మానవ వనరుల శాఖాభివృద్ధి పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటి కోసం దీనిపై అధికారం ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తక్షణం స్పందించి చక్రపాణిని డైరక్టర్‌గా నియమించి తెలంగాణతో సంబంధం లేకుండా చేసారు. అలాగే ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక శ్రద్ధతో లాంలో ఏర్పా టు చేశారు. సమాచార మంత్రి జోక్యంతో ఎపి ప్రెస్ అకాడమీకి దీక్షితులను చైర్మన్‌గా నియమించారం టూ ఆయా సంస్థలకు లేని అభ్యంతరాలు ఈ రెండు విశ్వవిద్యాలయాలకే ఎందుకు వస్తున్నాయని అలాగే ఉభ య రాష్ట్రాల పరిధిలోనున్న అనేక సంస్థల్లో పనిచేసేవారికి జీతాల సమస్య లేదన్నారు. తెలుగు అకాడమీ బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు పైగా నిధులున్నాయని ఆ నిధులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందం టూ యార్లగడ్డ హెచ్చరించారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్