రాష్ట్రీయం

పక్షీంద్రుడిపై పద్మావతీ విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 13: శ్రీహరిని, అమ్మవారిని నిత్యం సేవించే దాసుడు, రక్షణ బలుడైన పక్షీంద్రుడు ఆదివారం రాత్రి తనకిష్ణుడైన గరుడ వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారి విహారం భక్తులకు నయనానందం కలిగించింది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఎంతో విశిష్టత ఉంది. గరుత్మంతుని రెండు రెక్కలు జ్ఞాన, వైరాగ్యాలకు నిదర్శనాలు. మానవుడి నిత్యజీవితాల్లో చోటుచేసుకునే పలు కష్ట సుఖాలను తొలగించేదే గరుడ మంత్రం. అందుకే గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు ఇష్టపడతారు.
కన్నుల పండువగా గరుడ సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం రాత్రి అమ్మవారి గరుడ వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ పద్మావతీ అమ్మవారి ఊంజల్ సేవ అనంతరం వాహన మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అంతకుముందు ఆలయానికి తీసుకువచ్చిన శ్రీవారి పాదాలను అమ్మవారికి ధరించేసి అమ్మవారిని శ్రీ మహావిష్ణుమూర్తిగా ఆలయ అర్చకులు అత్యంత శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై అధిష్ఠింప చేశారు. అనంతరం సర్వాంగ శోభితురాలైన పద్మావతీ అమ్మవారు గరుడుడిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల కోర్కెలను తీర్చారు.
స్వర్ణ రథంలో
అనంత సూర్యతేజోమయి
ఆదివారం సాయంత్రం అనంత సూర్య తేజోమయి అయిన పద్మావతీదేవి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు సిరిసంపదలను ప్రసాదించారు. స్వర్ణరథంపై విహరిస్తున్న అమ్మవారికి పెద్దఎత్తున మహిళలు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వర్ణరథ సేవలో పాల్గొని పునీతులయ్యారు. స్వర్ణరథం ఆరంభం నుంచి చివరి వరకు మహిళల చేతనే రథాన్ని లాగించడం విశేషం. ఇదిలావుండగా ఆదివారం ఉదయం అమ్మవారు కాళంగి మర్ధని అలంకరణలో నాలు గు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డి.సాంబశివరావు, జెఇఓ పోలా భాస్కర్, అమ్మవారి ఆలయ డిప్యూటీ ఇఓ చెంచులక్ష్మి, విజిఓ రవీంద్రారెడ్డి, ఎఇఓ రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌లు వరప్రసాద్, రవి, ఆర్జితం, ప్రసాదాల ఇన్స్‌పెక్టర్లు ఆంజనేయులు, గురవయ్య, ఇతర ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

స్వర్ణరథంపై ఊరేగుతున్న పద్మావతీ అమ్మవారు