రాష్ట్రీయం

గోతులు కనిపిస్తే సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రహదారులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తన కార్యాలయంలో శనివారం ఆర్ అండ్ బి అధికారులో సమీక్ష నిర్వహించారు. అధునాతన సాంకేతిక విధానాలను అమలు చేసి రాష్ట్రంలో రహదారి వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించాలని ఆయన కోరారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంతోపాటు లైడర్ టెక్నాలజీని ప్రవేశపెట్టి రహదారుల సర్వేను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టే ముందు ట్రాఫిక్ సర్వే, సాయిల్ కండిషన్, రెయిన్‌ఫాల్ వివరాలను సమగ్రంగా సేకరించాలని సిఎం ఆదేశించారు. రానున్న రోజుల్లో గోతులు లేని రహదారులు కనిపించాలని, ఎక్కడ చిన్న గొయ్యి కనిపించినా సహించేది లేదని సిఎం అధికారులను హెచ్చరించారు. దీనికి అవసరమైన యాప్‌ను రూపొందించాలని ఆయన అధికారులను కోరారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల సమస్యను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియచేసే విధంగా ఈ యాప్ ఉండాలని సిఎం ఆదేశించారు.
ఇదిలాఉండగా వాహనాల వేగాన్ని పసిగట్టే అత్యంత ఆధునిక సాంకేతికతను రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నామని చంద్రబాబు చెప్పారు. వాహనంలో ప్రయాణించే వారి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఆ వాహన వేగాన్ని కనుగొనే విధానాన్ని గూగుల్ సంస్థ ఎపికి అందిస్తోందని అన్నారు.
పుష్కరాల నాటికి దుర్గమ్మ వారథి
కృష్ణా పుష్కరాల నాటికి విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర నిర్మిస్తున్న వారధి పనులకు సంబంధించి నాలుగు లేన్ల రోడ్డు పని పూర్తివుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రోడ్ ఓవర్ బ్రిడ్జి పనుల్లో 19 పురోగతిలో ఉంటే, 39 పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఐదు ఆర్వోబీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సిఎం చెప్పారు. రాజధాని రహదారుల పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చిత్రం విజయవాడలో శనివారం ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు