రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రవాణా శాఖ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళికను ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. రోడ్డు సేఫ్టీ అథారిటీకి తొలి దశలో రూ. 40 కోట్లను కేటాయించేందుకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2014లో రోడ్డు ప్రమాదాల్లో 6906 మంది మృతి చెందారు. 2015లో 7110 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద మరణాలు నియంత్రించేందుకు సేఫ్టీ అథారిటీ ఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రోడ్డు సేఫ్టీ అథారిటీకి అదనపు డిజిపి పోలీసు అధికారిని నియమించనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరగడంతో ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాలు రోడ్డు సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జాతీయ స్ధాయిలో రోడ్డు సేఫ్టీ అథారిటీ ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలను నిర్దేశించేందుకు ఈనెల 12, 13 తేదీల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జాతీయ వర్క్‌షాపు నిర్వహించనున్నారు. సదస్సుకు రాష్ట్ర రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హాజరవుతున్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులపై 370 వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది. హైదరాబాద్- అలంపూర్ వరకు 44వ నంబర్ జాతీయ రహదారి, హైదరాబాద్- రామగుండం రాజీవ్ రహదారిపై ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. జాతీయ రహదారులపై ప్రతి 60 కి.మీకు ఒక పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ పోలీసులు వాహనాల డ్రైవర్లను తనిఖీ చేసి మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లను పట్టుకుని వారి లైసెన్సులను రద్దు చేస్తుంది. జాతీయ రహదారుల వెంట ప్రమాదకర ప్రదేశాల్లో ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను నిరోధించేందుకు రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖల సిబ్బంది ఉమ్మడిగా పనిచేస్తారు. ట్రక్కు డ్రైవర్లకు జాతీయ రహదారుల వెంట విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేస్తారు.

రోడ్డు ప్రమాదం (పాత చిత్రం)