రాష్ట్రీయం

త్వరలో ఎన్నారై పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లే తెలంగాణ యువత కోసం ఎన్‌ఆర్‌ఐ పాలసీకి రూపకల్పన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు ఎన్‌ఆర్‌ఐ విభాగం బాధ్యతలు సైతం అప్పగించారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీకి రూపకల్పన చేయాలని ఐటి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి ఎన్‌ఆర్‌ఐ పాలసీలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పంజాబ్ నుంచి ఎక్కువగా ఇంగ్లాండ్, అమెరికా దేశాలకు వెళతారు. పంజాబ్ ఎన్‌ఆర్‌ఐల సమస్యలు వేరు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల సమస్యలు వేరు. కేరళ, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల సమస్యలు సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేరళ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీపై కెటిఆర్ ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా నుంచి వేలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. కెటిఆర్ గల్ఫ్ దేశాల్లో పర్యటించి తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికుల కష్టాలను స్వయంగా చూశారు. గల్ఫ్‌లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు పెద్దఎత్తున మోసాలు చేయడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గల్ఫ్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. దాని కోసం హైదరాబాద్‌లోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సమగ్రమైన ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పన చేసి వారికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలసీ వల్ల విదేశాలకు వెళ్లే యువత మోసాలకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు కెటిఆర్ తెలిపారు. విదేశాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురైన వారికి, మరణించిన వారికి అందాల్సిన సహాయం అంశాలను పాలసీలో పొందుపరుస్తారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చే పెట్టుబడులు, ఇతర భాగస్వామ్యల స్వీకరణకు ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలో చర్చిస్తారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పనపై వారంలో అధికారులతో కెటిఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు సమావేశానికి వలస కార్మికుల సంక్షేమం కోసం స్వదేశంలో పని చేస్తున్న పలువురు వ్యక్తులను, సంఘాలను ఆహ్వానిస్తున్నారు. అన్ని సంఘాలతో కలిసి దేశంలోనే అత్యున్నతమైన విధానానికి రూపకల్పన చేయనున్నట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. ముసాయిదా పత్రం రూపకల్పన తరువాత సిఎంతో చర్చించి పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు.