రాష్ట్రీయం

ఫీజుల దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ముషీరాబాద్, జూన్ 11: స్కూల్ ఫీజులను నియంత్రించాలని, విద్యాసంస్థల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని కోరుతూ శనివారం ఇందిరాపార్కు వద్ద స్కూల్ ఫీజుల నియంత్రణ కమిటీల జాయింట్ యాక్షన్ కమిటీ మహాధర్నా నిర్వహించింది. జాక్ నేతలు అరవింద్ జటా, నాగటి నారాయణ సహా వందలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, నాయకులు, ఎన్‌జిఓ ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ప్రవర్తన విలువలు హరించేలా ఉందని అన్నారు. ఫీజుల పెంపునకు ఒక విధానం అంటూ లేకపోయిందని అన్నారు. సౌకర్యాల కల్పన పేరిట తల్లిదండ్రలను యాజమాన్యాలు నిలువునా దోపిడీ చేస్తున్నాయని అన్నారు. విద్య చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజుల పద్ధతిని అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలుచేయాలని ఆయన సూచించారు.
బిసి సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించటానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఫీజులు తల్లిదండ్రుల పాలిట గుదిబండగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.సిపిఎం నేత పిజె.నర్సింగ్‌రావు, సిపిఐ నాయకురాలు పద్మ, వైకాపా నుంచి నల్లా సూర్యప్రకాష్, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ప్రొఫెసర్ పిఎల్ విశే్వశ్వర్‌రావు, సిఐటియు నేత సుధాభాస్కర్, సామాజిక విశే్లషకులు కంచె ఐలయ్య, ఆటోడ్రైవర్ల జెఎసి చైర్మన్ అమానుల్లాఖాన్, జెఎసి చైర్మన్ అరవింద జటా ఈ మహాధర్నాలో మాట్లాడారు. కార్యక్రమంలో జెఎసి ప్రతినిధులు రాచకొండ మల్లేష్‌బాబు, జి.శారద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం స్కూలు ఫీజుల దోపిడీని అరికట్టాలని శనివారం హైదరాబాద్‌లో జాక్ నిర్వహించిన మహాధర్నాలో ప్రసంగిస్తున్న చుక్కా రామయ్య