రాష్ట్రీయం

ముద్రగడను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, ముద్రగడను కాపాడాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది సతీష్ గల్లా శనివారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కిర్లంపూడిలో దీక్షను ప్రారంభించిన రోజు ముద్రగడ పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ విచారణకు స్వీకరించారు. న్యాయవాది వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య చేస్తున్న దీక్ష శిబిరాన్ని కాపు వర్గానికి చెందిన ప్రజలు సందర్శించకుండా పోలీసులు నిరోధించారని న్యాయవాది, అఖిల భారత కాపు జాగృతి సంస్థ కన్వీనర్ గల్లా సతీష్ కోర్టుకు తెలిపారు. టిడిపి అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది వాదనను కూడా రికార్డు చేయాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముద్రగడను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, కిర్లంపూడికి ప్రజలు వెళ్లకుండా పోలీసులు నిరోధించడం లేదని, కాని 144వ సెక్షన్‌ను విధించారని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను గురువారానికి వాయిదావేశారు.