రాష్ట్రీయం

రెడ్డి, బ్రాహ్మణులను కించపరిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: సినిమాల్లో రెడ్డి, బ్రాహ్మణ కులస్తులను కించపరుస్తూ చూపిస్తే సహించేది లేదని ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి సినిమా నిర్మాతలను, దర్శకులను హెచ్చరించారు. సినీ పరిశ్రమ ఇలాంటి వైఖరి కొనసాగిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు, సినిమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సినిమాల్లో రెడ్లను ఫ్యాక్షనిస్టులు, క్రిమినల్స్‌గా, బ్రాహ్మణులను బఫూన్లుగా చూపించడం ఫ్యాషనయిపోయిందని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి దృశ్యాలు లేకుండా సెన్సార్ బోర్డు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన సరైనోడు, అ ఆ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో విలన్లకు రెడ్డి పేర్లు పెట్టి సమాజంలో అసహ్యించుకునేలా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. రెడ్డి సామాజికవర్గ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలు తీస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలో రాంగోపాల్‌వర్మకు తగిన బుద్ధి చెప్పడంతో రెడ్లను కించపరచడం తగ్గిపోయిందని గుర్తు చేశారు. ఆదాయం కోసం రెడ్డి, బ్రాహ్మణ వర్గాలను కించపరుస్తూ డైలాగులు రాస్తే ఇకపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రెడ్లను విలన్లుగా, దుర్మార్గులుగా చూపిస్తున్న సినిమాలకు సెన్సార్ సర్ట్ఫికెట్లు ఇవ్వవద్దని కోరారు.