రాష్ట్రీయం

తెలంగాణ ఎడ్‌సెట్‌లో 40,826 మంది అర్హులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి శనివారం సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్రంలోని 200 కాలేజీల్లో 20వేల వరకూ సీట్లు ఉన్నాయని, వాటిలో ప్రవేశానికి ఎడ్‌సెట్‌లో 40,826 మందికి అర్హత దక్కిందని వచ్చే నెల మొదటి వారంలో అడ్మిషన్ల కౌనె్సలింగ్ నిర్వహిస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు.
ఎడ్‌సెట్‌లో అబ్బాయిలు 11,913 మంది రెట్టింపు సంఖ్యలో అమ్మాయిలు 28,913 మంది అర్హత సాధించారు. గణితంలో 2037మంది అబ్బాయిలు, 5841 మంది అమ్మాయిలు, పిఎస్‌లో 831మంది అబ్బాయిలు, 1738 మంది అమ్మాయిలు, బయాలజీలో 2418 మంది అబ్బాయిలు, 8068 మంది అమ్మాయిలు, సోషల్‌లో 6422 మంది అబ్బాయిలు, 12896 మంది అమ్మాయిలు, ఇంగ్లీషులో 199మంది అబ్బాయిలు, 370 మంది అమ్మాయిలు అర్హత సాధించారు.
డిగ్రీ తర్వాత మరో డిగ్రీ చేసే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని, ఆ కారణంగా బిఇడికి పోటీ తగ్గిందని ఆయన చెప్పారు. ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పడాల ప్రసాద్, చైర్మన్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటాచలం సహా ఎడ్‌సెట్ కమిటీ సభ్యులు, సహాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాథమెటిక్స్ నుండి 7878, పిఎస్ నుండి 2575, బయాలజీ నుండి 10,486 మంది అర్హత సాధించారని అన్నారు. సోషల్‌నుండి 19,318 మంది, ఇంగ్లీషు నుండి 569 మంది అర్హత సాధించారని చెప్పారు.
మీడియం వారీ చూస్తే తెలుగు ఇంగ్లీషు వారు 40,029 మంది, ఉర్దూ -ఇంగ్లీషు వారు 797 మంది అర్హత సాధించారు. యూనివర్శిటీల వారీ ఉస్మానియా, కెయు నుండి 40220 మంది, ఆంధ్రా, నాగార్జున వర్శిటీల నుండి 192 మంది, ఎస్వీయు, ఎస్‌కెయుల నుండి 121 మంది, ఇతర ప్రాంతాల నుండి 293 మంది అర్హత సాధించారని అన్నారు. అర్హత సాధించిన వారిలో ఎస్సీలు అబ్బాయిలు 3499, అమ్మాయిలు 6802 మంది, ఎస్టీలు అబ్బాయిలు 2485, అమ్మాయిలు 2842, బిసిఎ అబ్బాయిలు 764, అమ్మాయిలు 1904, బిసిబి అబ్బాయిలు 1874, అమ్మాయిలు 5957, బిసిసి అబ్బాయిలు 34, అమ్మాయిలు 138, బిసిడి అబ్బాయిలు 2415, అమ్మాయిలు 5499, బిసిఇ అబ్బాయిలు 360, అమ్మాయిలు 2228 మంది అర్హత సాధించారు.
టాపర్లు వీరే
మాథ్స్‌లో సర్వర్ మియా మహ్మద్ ఫస్టు ర్యాంకు సాధించగా, రెండో ర్యాంకు ఎం స్వాతి, 3వ ర్యాంకు దాసరి రాంబాబు, 4వ ర్యాంకు మంగాలి చంద్రకళ, 5వ ర్యాంకు కె రమేశ్ సాధించారు. ఆరో ర్యాంకు ఫాయిమీనా యాస్మిన్, ఏడో ర్యాంకు ఫరియా రుహీ, 8వ ర్యాంకు అనీసా, 9వ ర్యాంకు ఎం స్వాతి, 10వ ర్యాంకు బి విద్యాసాగర్ సాధించారు.
ఫిజికల్ సైన్స్‌లో ఫస్టు ర్యాంకు పి నరేష్, రెండో ర్యాంకు టి అభినయ షరాన్, 3వ ర్యాంకు వివిఎస్ రవికుమార్, 4వ ర్యాంకు జె దినీష్ రాహుల్, 5వ ర్యింకు అజీమ్ బేగ్ మిర్జా సాధించారు.
బయాలజీలో ఫస్టు ర్యాంకు మనె్నం అరుణ, 2వ ర్యాంకు అఫీఫా అతహర్, 3వ ర్యాంకు సయ్య నబీలా గుల్నార్, 4వ ర్యాంకు వీసం గీతిక, 5వ ర్యాంకు నగ్మా మహెవీన్ సాధించారు.
సోషల్‌లో ఫస్టు ర్యాంకు జి శ్రీనివాస్, రెండో ర్యాంకు బి రాజు వీరమల్లు, 3వ ర్యాంకు నాయని శ్రీనివాస్, 4వ ర్యాంకు సి సురేష్, 5వ ర్యాంకు బి శ్రీదేవి సాధించగా, ఇంగ్లీషులో ఫస్టు ర్యాంకు గాయత్రికి దక్కింది.