రాష్ట్రీయం

నెయ్యి ట్యాంకర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, జూన్ 11: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లామ్‌నగర్ గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున నెయ్యి తీసుకువెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. నెయ్యి ట్యాంకర్ బోల్తాపడిన సమాచారం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి వెళ్ళి రోడ్డు పక్కన పారుతున్న నెయ్యిని అందినకాడికి డబ్బాల్లో తీసుకువెళ్ళారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనే రాయ్‌బరేలి నుండి తిరుపతికి ఏపి 25 ఏపి 3198 నెంబర్ గల ట్యాంకర్ సుమారు 13 టన్నుల నెయ్యితో వెళ్తుండగా ఇస్లామ్‌నగర్ సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక పోలీసులు నెయ్యి ట్యాంకర్‌ను స్వాధీనపర్చుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

చిత్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో బోల్తాపడ్డ నెయ్యి ట్యాంకర్..