రాష్ట్రీయం

కొత్త జిల్లాలతో పదవులకు ఎసరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 11: కొత్త జిల్లాల ఏర్పాటు అనేక మందికి ఆనందం కలిగిస్తున్నా కొందరికి మాత్రం నిరాశ కలిగిస్తోంది. గంపెడాశలతో కొందరు నేతలు అనుభవిస్తున్న పదవులు కొత్త జిల్లాల ఏర్పాటుతో కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. స్థానిక సంస్థలు, సహకార సంస్థల ఎన్నికల సమయంలో తమకు అనువైన చోట గాడ్‌ఫాదర్ల అండదండలతో పోటీ చేసి గెలుపొంది జిల్లాస్థాయి పదవులను అధిష్టించిన నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుతో అవికాస్తా చేజారిపోయే పరిస్థితితో ఆందోళనకు గురవుతున్నారు.అక్టోబర్ 11వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారంతా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పరిధిలో పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్‌పర్సన్లుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా తమ పదవులను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పదవులు రాకపోగా ఉన్న పదవులు పోతుండటంతో తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ పెద్దల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్న గడిపల్లి కవిత వెంకటాపురం మండలం జడ్పీటిసిగా ఉన్నారు. ఆ మండలం నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్తుండటంతో ఆమె అక్కడ పదవి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే డిసిఎంఎస్ చైర్మన్‌గా ఉన్న ఎగ్గడి అంజయ్య వాజేడు మండల వాసి కాగా, ఆ మండలం కూడా కొత్త జిల్లా పరిధిలోకి వెళ్తుంది. ఇదే తరహాలో నల్గొండ డిసిసిబి చైర్మన్ పాండురంగారావు కోదాడ నియోజకవర్గ వాసి కాగా, ఇది సూర్యాపేట జిల్లాలోకి వెళ్ళనున్నది. వరంగల్ జిల్లా చైర్‌పర్సన్‌గా గద్దల పద్మ ప్రాతినిధ్యం వహిస్తున్న నర్మెట్ట మండలం యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల్లో ఒక దాని పరిధిలోకి వెళ్ళనున్నది. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న కపిలాపూర్ మండలం సిరిసిల్ల జిల్లాలోకి వెళ్ళనున్నది.