రాష్ట్రీయం

జూలై 8లోగా నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్‌కౌంటర్ కేసులో తుది నివేదికను జూలై 8వ తేదీలోపల సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్)ను ఆదేశించింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన కూలీలు మరణించిన విషయం విదితమే. ఈ ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం జారీ చేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొన్ని పౌర సంఘాలు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కూలీల కుటుంబ సభ్యులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. నిరుడు ఏప్రిల్ 20వ తేదీన శేషాచలం కొండల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎర్రచందనం చెట్లను నరికివేసేందుకు వచ్చినట్లుగా చెబుతున్న కూలీలు ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తమ ఎదుట లొంగిపోవాలని పలుసార్లు హెచ్చరించినా కూలీలు ఖాతరు చేయకుండా తమపై దాడులు దిగారని పోలీసులు చెబుతున్నారు. పౌరహక్కుల సంఘాలు మాత్రం పోలీసులు కూలీలను పట్టుకుని కాల్చి చంపారని హైకోర్టుకు తెలిపాయి. ఈ కేసును హైకోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న కింది కోర్టులో సిఆర్‌పిసి కింద నివేదిక ఇచ్చామని పోలీసుల తరఫున న్యాయవాది తెలిపారు. ఈ నివేదికను ఈ నెల 25వ తేదీన కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా తమ ఎదుట పిటిషన్లను విచారిస్తున్నామని, జూలై 8వ తేదీ నాటికి ఎన్‌కౌంటర్‌పై నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.