రాష్ట్రీయం

దీక్షలోనే ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 12: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. తక్షణం వైద్యం అందించాల్సి ఉందని, కానీ అందుకు ముద్రగడ అంగీకరించడం లేదని ఆదివారం హెల్త్ బులిటిన్‌లో వైద్యులు తెలిపారు. ముద్రగడ దంపతులు, కొడుకు గిరి, భార్య సిరి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. గత రాత్రి ముద్రగడ భార్య పద్మావతి, కోడలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ వైద్య సేవల నిరాకరణ కొనసాగుతోంది. ముద్రగడ భార్యకు, కోడలుకు సిలైన్ పెట్టినట్టు తెలిపారు. వైద్య సేవలకు ముద్రగడను ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన దణ్ణం పెట్టి సున్నితంగా నిరాకరిస్తూ దగ్గరకు రావొద్దని డాక్టర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు మధ్యాహ్నం విడుదల చేసిన వైద్య బులిటిన్‌లో తెలిపారు. ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల దీక్ష ఆదివారానికి నాలుగోరోజుకు చేరింది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన పెరుగుతోంది. ముద్రగడను స్థానిక శాసన సభ్యుడు ఆకుల సత్యన్నారాయణ పరామర్శించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం కల్పించాలని ముద్రగడకు తాను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశానని చెప్పారు. కాపు జెఎసి ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు చర్చలకు ముందడుగు వేస్తే సమస్యను పరిష్కరించుకునే అవకాశం వుంటుందని ముద్రగడను కోరినట్టు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఇదిలావుండగా ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరం చేరుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును పోలీసులు ఆయన బస చేసిన హోటల్ గదిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన మాజీ ఎంపి జివి హర్షకుమార్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. విహెచ్ పోలీసులను తప్పించుకుని ఏదో విధంగా రాజమహేంద్రవరం చేరుకోవాలని ప్రయత్నించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో కాకుండా, కొవ్వూరు స్టేషన్‌లోనే దిగిపోయి అక్కడ నుంచి గోదావరి నది ఫోర్త్ బ్రిడ్జి రోడ్డు మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. హోటల్‌కు చేరుకునేలోగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముద్రగడ పట్ల అమానుషంగా ప్రవర్తించడం దారుణమని, ఇక్కడ యుద్ధ వాతావరణం కన్పిస్తోందని విహెచ్ వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తనను నిర్బంధించినందుకు నిరసనగా విహెచ్ హోటల్ రెస్టారెంట్లో భోజనం చేయకుండా హోటల్‌లోనే బైఠాయించారు.

చిత్రం ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని మీడియాకు తెలియజేస్తున్న వైద్యులు