రాష్ట్రీయం

బస్ భవన్‌ను వదులుకున్నట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ఏపిఎస్ ఆర్టీసి విభజన కాలేదు. ఆస్తుల పంపకం ప్రక్రియ నిలిచిపోయింది. కాని ఇక్కడ బస్‌భవన్‌లో ఉన్న ఏపి ఆర్టీసి ఉద్యోగులను ఈ నెల 27లోగా విజయవాడ బస్ హౌస్‌లో రిపోర్టు చేయాలని ఆర్టీసి ఎండి ఆదేశాలు ఇవ్వడంతో ఎంప్లారుూస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ బస్ భవన్‌లో పని చేస్తున్న 250 మంది సిబ్బంది విజయవాడకు వెళితే, ఈ కార్యాలయంలో ఏపి లీగల్ శాఖ సిబ్బంది మాత్రమే ఉంటారని సమాచారం. ఆర్టీసిలో టిఎస్‌ఆర్‌టిసిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుండా ఆర్టీసి విభజనపై తొందరపడి నిర్ణయాలు తీసకుంటే ఆంధ్ర ఆర్టీసికి భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు. సోమవారం ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు ఎండిని కలుస్తామన్నారు. హైదరాబాద్‌లో విభజన కాని ఏపిఎస్ ఆర్టీసికి 14 విలువైన ఆస్తులు ఉన్నాయని, వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ. 1500 కోట్లని చెప్పారు. ఉమ్మడి ఆస్తుల్లో ఆంధ్రాకు 58 శాతం వాటారావాలన్నారు. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసి యాజమాన్యం చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. ఇంటర్ స్టేట్ పేరుతో రూట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే ఆంధ్రాలో మూడు వేల మంది ఆర్టీసి సిబ్బంది అయోమయంలో పడతారని దామోదరరావు తెలిపారు. కాగా ఆర్టీసి యాజమాన్యం చర్యలకు నిరసనగా ఈ నెల 17వ తేదీన భోజనన విరామ సమయంలో ధర్నాలు చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. ఏపిలో అన్ని చోట్ల ఎన్‌ఎంయు నిరాహార దీక్షల కార్యక్రమం చేపడుతుందన్నారు.