రాష్ట్రీయం

డూప్లికేట్ల గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రైతుల పంట రుణాల మాఫీ కేటాయింపుల్లో ప్రభుత్వానికి భారీగా నిధులు మిగులనున్నాయి. బ్యాంకర్లకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థతోపాటు రుణ మాఫీ లబ్థిదారుల ఆధార్ కార్డుల సీడింగ్‌తో పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఖాతాల గుట్టు రట్టయ్యింది. దీంతో పంట రుణ మాఫీకి అర్హులైన వారి సంఖ్య భారీగా తగ్గనుండటంతో ప్రభుత్వానికి సుమారు రూ.1800 నుంచి రూ. 2000 కోట్ల వరకు మిగులుబాటు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచన వేస్తున్నారు. పంట రుణ మాఫీ కింద ఒక్కో రైతు కుటుంబం లక్ష రూపాయలకు మించి లబ్ధిపొందకుండా బ్యాంకర్ల నిఘా వ్యవస్థ, ఆధార్ కార్డుల సీడింగ్ దోహదం చేసిందని అధికార వర్గాల సమాచారం. అర్హులైన రుణ మాఫీ లబ్థిదారుల ఖాతాల వడబోత ప్రక్రియ వల్లనే రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడవ విడత చెల్లింపుల జాప్యానికి కారణమని వ్యవసాయశాఖ వర్గాల సమాచారం. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు మాత్రమే పంట రుణ మాఫీ చేయనున్నట్టు టిఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చిన విధంగానే ప్రభుత్వం కట్టుబడి ప్రకటించింది. అయితే రుణ మాఫీకి అర్హులైన రైతులు వేర్వేరు బ్యాంకుల నుంచి పొందిన రుణాలపై ప్రభుత్వం వద్ద సమాచారం లేకపోవడంతో రుణ మాఫీ మొత్తం రూ. 17 వేల కోట్లు ఉంటుందని అంచన వేసింది. ఆ మేరకు ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఏడాదికి రూ. 4,250 కోట్ల చొప్పున బడ్జెట్‌లో కేటాయించి విడుదల చేసింది. ఇప్పటికి రెండు విడతల్లో బ్యాంకులకు రూ. 8 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించింది. రెండవ విడత చెల్లించే నాటికే రుణ మాఫీ లబ్ధిదారుల ఆధార్ కార్డులను బ్యాంకర్లు అనుసంధానం చేయడంతో రూ. వెయ్యి కోట్ల దాకా మిగులు కనిపించింది. దీంతో రుణ మాఫీ అర్హులను గుర్తించడానికి మరో అడుగు ముందుకేసి రుణ గ్రహితల ట్రాక్ రికార్డుల పరిశీలనకు బ్యాంకర్లు వినియోగిస్తున్న నిఘా వ్యవస్థను ప్రభుత్వం అనుసరించింది. రుణ గ్రహితల ట్రాక్ రికార్డులను సిఐబిఐఎల్ (క్రెడిట్ ఇన్ఫర్మెషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ సంస్థ ద్వారా బ్యాంకర్లు పరిశీలిస్తారు. రుణ గ్రహితల రుణ మొత్తాలను, గతంలో తీసుకున్న రుణాలను ఏవిధంగా చెల్లించిన ట్రాక్ రికార్డులను, బ్యాంకర్లకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచిన ఇతర బ్యాంకుల ఖాతాల సమగ్ర సమాచారం యావత్తు సిఐబిఐఎల్ క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ సమాచారం ఆధారంగానే రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను బ్యాంకర్లు తిరస్కరించడం కానీ రుణాలను మంజురు చేయడం కానీ జరుగుతుంది. ఈ విధానాన్ని రుణ మాఫీ పథకంలో ప్రభుత్వం అనుసరించడంతో వేర్వేరు బ్యాంకుల్లోని ఖాతాల ద్వారా లక్ష రుపాయల కంటే ఎక్కువ లబ్ధిపొందిన రైతుల గుట్టు రట్టు అయింది. దీంతో మూడవ విడత చెల్లింపులో
రూ.500 కోట్ల మిగులుబాటు అయింది. ఇదే లెక్కన నాలుగవ విడతలో కూడా అంతే మొత్తంలో మిగులుబాటు అయితే ప్రభుత్వానికి సుమారు రూ. 2 వేల కోట్ల వరకు మిగులుబాటు అయినట్టే. ఉదాహరణకు ఒక రైతు తన పేరుపై రూ. 60 వేలు, భార్య పేరు మీద రూ. 40 వేల పంట రుణాన్ని పొంది ఉంటే రుణ మాఫీ పథకం కింద ఆ రైతు కుటుంబానికి మొత్తం మాఫీ అవుతుంది. అయితే మరో సర్వే నంబర్ కలిగిన భూమిపై మరో బ్యాంకులో సదరు రైతు రూ. 60 వేలు పంట రుణం పొంది ఉంటే దానికి రుణ మాఫీ వర్తించదు. ఒకే రైతు వేర్వేరుగా ఇతర బ్యాంకుల నుంచి పొందిన పంట రుణాల సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటు లేకపోవడం వల్ల రుణ మాఫీ మొత్తాన్ని రూ. 17 వేల కోట్లుగా అంచన వేయగా, అసలైన, అర్హులైన లబ్ధిదారుల సమాచారం ప్రభుత్వానికి తాజాగా అందుబాటులోకి రావడం వల్ల దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి మిగులుబాటు కాబోతుందని అధికారులు అంచన వేస్తున్నారు.