రాష్ట్రీయం

కెసిఆర్‌ను కలిసిన గుత్తా, భాస్కర్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12:కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. వీరిద్దరూ టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరిద్దరూ పార్టీ మారకుండా నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావులతో పాటు మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి వీరితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కష్టాల్లో ఉన్న పార్టీని వీడి వెళ్లడం మంచిది కాదని నచ్చజెప్పారు. అయినా వీరు పార్టీ మారాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. వినోద్, వివేక్‌లు ఈనెల 15న టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోగా, గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావులు చేరాలని నిర్ణయించుకున్నా, ఏ తేదీన చేరేది తేలాలి.
15న టిర్‌ఎస్‌లోకి...
మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు ఈనెల 15న టిఆర్‌ఎస్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో వీరు టిఆర్‌ఎస్‌లో చేరుతారు. టిడిపి పని దాదాపు ఖాళీ అయిందని భావిస్తున్న టిఆర్‌ఎస్ నాయకత్వం కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలపై దృష్టిసారించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలపై దృష్టిసారించారు. అదే విధంగా కాంగ్రెస్‌లో స్థానికంగా ప్రభావం చూపించగల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 2009లో కేంద్రం తెలంగాణ ఏర్పాటును ప్రకటించి తిరిగి వెనక్కి వెళ్లినప్పుడు కాంగ్రెస్ ఎంపిగా ఉన్నవివేక్, వినోద్‌లు టిఆర్‌ఎస్‌లో చేరారు. యుపిఏ ప్రభుత్వం వెనుకడుగు వేసిన తరువాత జరిగిన ఉద్యమంతో వివేక్, వినోద్‌లు టిఆర్‌ఎస్‌లో చేరారు. 2013లో తిరిగి కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి, తెలంగాణ కల సాకారం చేయడంతో ఎన్నికల ముందు వివేక్, వినోద్‌లు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వనందుకే పార్టీని వీడామని, తెలంగాణ ఇచ్చినందున తిరిగి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సాధారణ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. తిరిగి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈనెల 15న భారీ ఎత్తున అభిమానులతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరితో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా 15న టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. వీరితో పాటు మరి కొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

చిత్రం నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపి వివేక్