రాష్ట్రీయం

చలో హైకోర్టు ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: హైకోర్టును విభజించి ప్రత్యేకంగా తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఇచ్చిన ‘చలో హైకోర్టు’ పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం పలు కోర్టుల న్యాయవాదులు విధులు బహిష్కరించి హైకోర్టు 6వ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. చలో హైకోర్టుకు అనుమతి లేదని ప్రకటించిన నగర కమిషనర్ కోర్టు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని కోర్టుల నుంచి తరలివస్తున్న న్యాయవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పలుచోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు పాసులు ఉన్నవారినే హైకోర్టులోనికి అనుమతించారు. ఆంక్షలు విధించిన పరిసరాల్లో న్యాయవాదులు ‘మా నిధులు, నీళ్లు, నియామకాలు మాకే కావాలి’ అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
లాయర్ల మూడు డిమాండ్లపై సిజె హామీ
తెలంగాణ న్యాయవాదుల జెఎసి చలో హైకోర్టు పిలుపు నేపథ్యంలో సుమారు 20 మంది న్యాయవాదులు హైకోర్టు చీఫ్ జస్టిస్ చాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మూడు డిమాండ్లపై హామీ ఇచ్చారని జెఎసి తెలిపింది. మూడు నెలల వరకు ఆప్షన్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోమని హామీ ఇచ్చారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశించారని, అదేవిధంగా హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించుకునేందుకు సిజె అనుమతించారని జెఎసి తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని 335 న్యాయమూర్తుల్లో 157 మంది మాత్రమే తెలంగాణ వారున్నారని ఆరోపించారు. న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తాము న్యాయవాదులకు, న్యాయమూర్తులకు వ్యతిరేకం కాదని, న్యాయమూర్తుల నియామకాల్లో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విభజన చట్టంలో ఉన్న నిష్పత్తి ప్రకారం సిబ్బంది నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుందని, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామని తెలంగాణ న్యాయవాదుల జెఎసి కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాలుగు రోజుల ఆందోళన కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. ఈ నెల 14న తెలంగాణలోని అన్ని కోర్టుల ఎదుట నిరాహార దీక్ష, 15న విధుల బహిష్కరణతోపాటు నిరశన కార్యక్రమాలు, 16న కోర్టుల ఆవరణల్లో వంటా-వార్పు, 17న పోస్టుకార్డులతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
న్యాయశాఖలోని పలు నియామకాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలని, విభజన చట్టంలోని నిష్పత్తి ప్రకారమే నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగనున్నారు. జూలై 1నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఉద్యోగుల జెఎసి ప్రకటించింది. సోమవారం రాష్ట్ర హైకోర్టుకు సమ్మె నోటీసు అందజేసినట్టు ఉద్యోగుల కార్యాచరణ సమితి తెలిపింది.

చిత్రం చలో హైకోర్టు పిలుపు మేరకు తరలివస్తున్న న్యాయవాదులను అడ్డుకుంటున్న పోలీసులు